Home » తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా ?

by Anji

తెలంగాణలో పదేళ్ల తర్వాత అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో రాష్ట్రాన్ని నడిపే బాధ్యత కూడా ఆయన మీదే పెట్టారు.

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.   రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, రాజకీయంగా చిత్తు చేసే వ్యూహాలతో సీఎం వరకు ఎదిగారు రేవంత్ రెడ్డి.  తెలంగాణకు రెండో సీఎం మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే యంగ్ అండ్ డైనమిక్ లీడర్. 

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే తాను ఇచ్చిన హామీలో తొలి సంతకం 6 గ్యారెంటీలపై చేశారు. రెండో సంతకం తాను ఉద్యోగం ఇస్తానని దివ్యాంగురాలుకు హామి ఇచ్చాడు. ఆ హామీ మేరకు ప్రమాణ స్వీకారం రోజే దివ్యాంగురాలు రజినీకి నియామక పత్రం అందజేశాడు. మరోవైపు ఆరోగ్య శ్రీ నిధులను రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, మహాలక్ష్మీ చేయూత పథకం ప్రారంభంతో మహిళలు రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి ప్రభుత్వం ఉచిత సౌకర్యం కల్పించింది. దీంతో చాలా సంతోష పడుతున్నారు మహిళలు. 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడు రోజులు కూడా గడవక ముందే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎల్బీస్టేడియంలో ఎన్టీఆర్,  వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు తరువాత ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కాడు రేవంత్ రెడ్డి ఇదిలా ఉంటే.. తాజాగా  వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. ఆయన ఎవరో కాదు మహేష్ బాబు తండ్రి దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు మార్మోగుతుంది. ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading