Home » జవాన్ సినిమాను వదులుకున్న ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా ?

జవాన్ సినిమాను వదులుకున్న ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా ?

by Anji
Published: Last Updated on

 బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, హీరోయిన్ నయన తార నటించిన తాజా మూవీ జవాన్. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు.  ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై.. అంచనాలను ఏమాత్రం తీసిపోకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చూడటానికి ఇప్పటికే చాలా మంది అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే..? ఈ చిత్రం చేయాల్సింది షారుఖ్ ఖాన్ కాదట.. మన టాలీవుడ్ లోని ఆ ఇద్దరూ హీరోల్లో ఎవ్వరో ఒకరు చేయాల్సి ఉండగా.. వారిద్దరూ రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ షారుఖ్ ఖాన్ చేతికి వెళ్లిందట. అసలు జవాన్ మూవీని రిజెక్ట్ చేసి టాలీవుడ్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

jawan-movie

 

ఈ చిత్రం కోసం తొలుత కోలీవుడ్ దర్శకుడు అట్లీ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకున్నారట. కానీ  వీరిద్దరూ హీరోలకు కథ చెప్పి ఇద్దరిలో ఎవరినో ఒకరినీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే వీరి బ్యాడ్ లక్ ఏంటంటే..? వీరిద్దరికీ దర్శకుడు కథ చెప్పినప్పటికీ వీరు రిజెక్ట్ చేశారట. అనుకోకుండా అకస్మాత్తుగా షారుఖ్ ఖాన్ కి కథ చెప్పాడట అట్లీ. దీంతో షారుఖ్ కథ నచ్చడం.. సినిమా సెట్ అవ్వడం అలా అన్నీ ఆటోమేటిక్ గా జరిగాయట.

 

షారుఖ్ కూడా దర్శకుడు అట్లీ నమ్మకంతో ఈ సినిమాని ఒప్పుకున్నాడట. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రతిభను వెలికి తీసి అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు దర్శకుడు అట్లీ. చాలా మంది టాలీవుడ్ జనాలు అబ్బా జస్ట్ మిస్.. ఈ సినిమా రామ్ చరణ్ లేదా మహేష్ బాబు చేసుంటే బాగుండేది కదా.. అని కామెంట్స్ పెడుతున్నారు.  అంతేకాదు.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఈ చిత్రం మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్ కాస్త బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !

 Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?

Visitors Are Also Reading