Home » 2018 : ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’

2018 : ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’

by Bunty
Ad

ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండానే వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాయి కొన్ని చిన్న సినిమాలు. అచ్చం ఇలాగే 2018 అనే సినిమా సింపుల్ గా వచ్చి… చిత్ర పరిశ్రమలనే షేక్ చేసింది. మే మాసంలో రిలీజ్ అయిన 2018 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్ లో విజయం అందుకోవడమే కాకుండా మన తెలుగులో డబ్ విజయవంతంగా దూసుకుపోతోంది.

Advertisement

మలయాళం లో మొదటగా విడుదలైన ఈ సినిమా… గత నెలలో తెలుగులో రిలీజ్ అయింది. బన్నీ వాసు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. రిలీజ్ కు ముందు ఒక ప్రెస్ మీట్ తప్పితే పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు బన్నీ వాసు. కానీ రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు తుఫాన్ లాంటి కలెక్షన్లను సాధించింది 2018 సినిమా.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. 2018 సినిమాను సోనీ లివ్ అనే OTT ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది. ఈ సినిమా ఇవాల్టి నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో చూడని వారు.. ఓటీటీ లో చూసేయండి. కాగా 2018లో కేరళ లో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?

Visitors Are Also Reading