Home » ఏ హీరో ఎక్కడ న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోబోతున్నారో తెలుసా ?

ఏ హీరో ఎక్కడ న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోబోతున్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి ఎక్కడ ఈ ఏడాది న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. తమ తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్లను పూర్తి చేసి ప్రశాంతంగా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి వెకేషన్ కు వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో హీరోలంతా విదేశాల్లో ఈ స్పెషల్ ఈవెంట్లను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలంతా తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. మరి ఏ హీరో ఎక్కడా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రస్తుతం జపాన్ లో ఉన్నట్టు సమాచారం. త్రిబుల్ ఆర్ మూవీ చేస్తున్న టైంలోనే జపాన్ కు వెళ్లిన ఎన్టీఆర్ కు అక్కడ వాతావరణం, లొకేషన్ అద్భుతంగా అనిపించిందట. అందుకే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం తారక్ నటిస్తున్న “దేవర” షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వెకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి దేవర షూటింగ్లో పాల్గొంటారు ఎన్టీఆర్.

ఇక మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. సూపర్ స్టార్ ఈసారి దుబాయిలో న్యూ ఇయర్ జరుపుకోబోతున్నారు. అక్కడ ఈ హీరోకు ఒక ఆడ్ ఫిలిం షూటింగ్ ఉండడం కూడా ఆయన దుబాయ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం. పనిలో పనిగా యాడ్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుని, ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ ఎంజాయ్ చేయబోతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది దుబాయ్ లోనే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన దుబాయ్ లోని అత్యంత ఎత్తైన హోటల్ బూర్జ్ ఖలీఫాలో న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా కొన్ని హోటల్ రూమ్ లను బుక్ చేశారని సమాచారం. గత ఏడాది కూడా అల్లు అర్జున్ అక్కడే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. మరి సెంటిమెంట్ గా భావించాడో ఏమో ఈసారి కూడా అక్కడే న్యూ ఇయర్ జరుపుకోవడానికి ఆసక్తిని కనబరిచాడు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా షూటింగ్లో భాగంగా ఇప్పటికే అమెరికా వెళ్లిపోయాడు.

“ఫ్యామిలీ స్టార్” మూవీ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర బృందంతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈసారి అమెరికాలోనే చాలా గ్రాండ్ గా న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక నాగార్జున ఇంకా “నా సామి రంగ” మూవీ షూటింగ్ లోనే ఉన్నారు. కాబట్టి ఆయన హైదరాబాదులోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది. అలాగే సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలయ్య వంటి వారు సైతం ఇక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నారు. మరోవైపు స్టార్ హీరోయిన్ లంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading