Home » తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ జరుపుకునేది ఎప్పుడో తెలుసా ? 

తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ జరుపుకునేది ఎప్పుడో తెలుసా ? 

by Anji
Ad

గల్ప్ దేశాల్లో రంజాన్ పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ గురువారమే నెలవంక కనిపించడంతో శుక్రవారం పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశంలో శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ జరుగనుంది. లేదంటే.. ఆదివారం పండుగ జరుగుతుందని ముస్లిం పెద్దలు ప్రకటించారు. శుక్రవారం నెలవంక దర్శనమిస్తే.. శనివారం రంజాన్ పండుగ జరుపుకోవాలని, లేదంటే ఆదివారం జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ వెల్లడించారు. 

Also Read :  ఇదేంటండి సమంత గారు.. ఇక్కడ ఇలా అక్కడ ఆలా ఉంటారా ? అంటే మీరు చెప్పేవి అబద్ధాలా ?

Advertisement

శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు దీనిపై ఓ స్పష్టత వస్తుందని.. దాని ప్రకారం..  దాని ప్రకారం పండుగ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. ఇస్లాంలో రంజాన్ మాసం చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్ విదాను పురస్కరించుకొని హైదరాబాద్ లోని అన్ని మసుల వద్ద ఏర్పాట్లను చేసారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ లోని రాయల్ మసీదులోని జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు పరిసరాలను కూడా శుభ్రం చేసినట్టు తెలిపారు. 

Advertisement

Also Read :  ఆ విషయంలో తన కొడుకుకు రాజమౌళి అన్యాయం చేశాడుగా…!

Manam News

రంజాన్ పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాల్లో సామూహిక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈద్గాల్లో సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సౌదీ అరేబియాలో చంద్రుడి దర్శనం ద్వారా ఈద్ ఉల్ ఫితర్ శుక్రవారం జరుపుకోవాలని కేరళలోని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఇవాళ కేరళలో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో రేపు వేడుకలు జరుగనున్నాయి. చంద్రుడి దృశ్యమానత ప్రకారం.. రేపు వేడుకలు జరుగుతాయి. 

Also Read :  మొలకెత్తిన గింజల వల్ల నష్టమా ? లాభమా ? 

Visitors Are Also Reading