Home » చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటో తెలుసా..?

చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ న‌టుడిగా, రెబ‌ర్ స్టార్ గా త‌న‌దైన ముద్ర వేసి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణం రాజు. దాదాపు 200 సినిమాల్లో ప‌లు పాత్ర‌ల‌ను పోషించిన కృష్ణంరాజు వాటికి మించిన పేరును తెర బ‌య‌ట కూడా సంపాదించారు. విజ‌య‌న‌గ‌ర క్ష‌త్రియ వంశానికి చెందిన కృష్ణంరాజు సినిమాల్లోకి రాక‌ముందే సుసంప‌న్నులు. ఆయ‌న సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత పెద్ద‌గా ఇబ్బంది ప‌డింది ఏమి లేదు. స్వ‌యంగా ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో చెప్పారు. ఓ ద‌శ‌లో త‌న‌కు అవ‌కాశాలు క్లిష్టంగా క‌నిపించ‌గా.. స్వ‌యంగా నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీశారు కృష్ణంరాజు.

Advertisement

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో 1970 ద‌శ‌కం చాలా కీల‌క‌మైంది. అప్ప‌టికే ఓవైపు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ స్టార్ హీరోలుగా వెలిగిపోతుండ‌గా.. 70వ ద‌శ‌కంలో కృష్ణంరాజు, శోభ‌న్ బాబులు స్టార్లుగా ఎదిగారు. ఇక వీరి మ‌ధ్య‌లో 70 ద‌శ‌కం చివ‌ర‌లో వెలుగులోకి వ‌చ్చాడు చిరంజీవి. చిన్న న‌టుడి నుంచి మొద‌లైన ప్ర‌స్థానం ఆయ‌న ప్ర‌స్థానం నేడు మెగాస్టార్ గా కొన‌సాగుతోంది. ఇక్క‌డ మ‌రో విశేష‌మేంటంటే రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుది, చిరంజీవిది ఒకే ఊరు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు. చిరంజీవి సిమాల్లోకి వ‌చ్చే నాటికి కృష్ణంరాజు సినిమాల్లో స్టార్ గా ఉండేవారు. దీంతో అంద‌రూ ఆయ‌న గురించి గొప్ప‌గా చెప్పుకునే వారు.

ఇది కూడా చ‌ద‌వండి :  లైగర్ సినిమాతో లాభాలు అందుకున్న నిర్మాతలు..!

Advertisement

చిరంజీవి ప్రారంభంలోనే కృష్ణంరాజుతో క‌లిసి న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఇక ఆ స‌మ‌యంలోనే చిరంజీవిది కూడా త‌న సొంత గ్రామం మొగ‌ల్తూరు అని కృష్ణంరాజుకి తెలిసింది. నాటి నుంచి మొద‌లైన అనుబంధం చివ‌రి వ‌ర‌కు కొనసాగింది. 2008లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తే.. 2009 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌రుపున రాజ‌మండ్రి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కృష్ణంరాజు పోటీ చేశారు. వ్య‌క్తిగ‌తంగా కృష్ణంరాజుని చిరంజీవి అన్న‌య్య అని పిలుస్తుంటారు. కృష్ణంరాజుకి దాన‌గుణం ఎక్కువ‌గా ఉంటుంది. ఆయ‌న ఇంటికి వెళ్లిన వారికి భారీగా భోజ‌నం వ‌డ్డిస్తార‌నే పేరు ఉంది. స్వ‌త‌హాగానే భోజ‌న ప్రియుడైన కృష్ణంరాజు షూటింగ్ లో ఉన్న వారందరికీ ఇంటి నుంచి భోజ‌నం తెప్పించేవార‌ని చెబుతుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి : మ‌మ్ముట్టి ఇంటి నుంచి ఎంత మంది న‌టులు ఇండస్ట్రీకి వ‌చ్చారో తెలుసా..?


కృష్ణంరాజు దాదాపు 35 ఏళ్ల కింద‌ట లండ‌న్ నుంచి ఓ ఖ‌రీదైన కెమెరా తెప్పించార‌ట‌. ఓ ఫంక్ష‌న్ లో చిరంజీవి దానిని చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ఎక్క‌డిది అన్న‌య్య ఇంత ఖ‌రీదైన కెమెరా.? లండన్‌లో దీనిని చూశాను. ఇష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ కొందామంటే చాలా ఖ‌రీదు అవుతుంద‌ని వ‌దిలేశాన‌ని కృష్ణంరాజుతో చిరంజీవి చెప్పారు. ఇక ఆ మాట‌లు విన్న మ‌రుక్ష‌ణ‌మే ట్యాగ్‌తో ఉన్న కెమెరాను చిరంజీవి మెడ‌లో వేశారు. దీంతో చిరంజీవి ఆశ్చ‌ర్య‌పోయారు. చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఇదే కావడం విశేషం.

ఇది కూడా చ‌ద‌వండి :  రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సినిమా నుండి ఎత్తేసారా..?

Visitors Are Also Reading