Home » కాబోయే భార్య పేరును వరుణ్‌ తేజ్‌ మొబైల్‌లో ఏమని సేవ్‌ చేసుకున్నాడో తెలుసా..?

కాబోయే భార్య పేరును వరుణ్‌ తేజ్‌ మొబైల్‌లో ఏమని సేవ్‌ చేసుకున్నాడో తెలుసా..?

by Anji
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో లవ్ బర్డ్స్ గా కనిపించారు. ఈ జోడీ త్వరలోనే రియల్ కపుల్ గా మారనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వరుణ్ తేజ్, లావణ్య ఈ ఏడాది జూన్ 09న నిశ్చితార్థం చేసుకున్నారు.

Advertisement

ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వరుణ్-లావణ్యల ప్రేమయణానికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ షోకి అతిథిగా వెళ్లాడు మెగా ప్రిన్స్. ఈ సందర్భంగా లావణ్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలపై ఎవ్వరికీ తెలియని విషయాలను బయటపెట్టాడు వరుణ్ తేజ్. తన మొబైల్ లో లావణ్య పేరుని ఎలా సేవ్ చేసుకున్నాడని ఆడియెన్స్ ప్రశ్నించగా.. LAVN  అని సమాధానం ఇచ్చాడు వరుణ్. లావణ్యనే తన ఫోన్ తీసుకొని అలా సేవ్ చేసిందని చెప్పుకొచ్చాడు వరున్. లావణ్యకి ఫస్ట్ గిప్ట్ ఏమిచ్చారని అడిగిన ప్రశ్నకు మాత్రం తనకు గుర్తుకు లేదని సమాధానం చెప్పాడు. మా ఇద్దరి రిలేషన్ షిప్ ప్రారంభమై చాలా సంవత్సరాలు అయిందన్నారు వరుణ్ తేజ్.

Advertisement

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరి మేనరిజం అనుకరించడానికి ఇష్టపడతారని అడిగితే.. ఇద్దరి మేనరిజమ్స్ తనకు ఇష్టమే అని చెప్పుకొచ్చాడు వరుణ్. ఇక పెళ్లి తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవ్వరిలో ఎక్కువగా మార్పులు వచ్చాయని ప్రశ్నించగా.. పెళ్లి అయ్యాక ఎవ్వరైనా మారిపోవాల్సిందే అని సమాధానం ఇచ్చాడు వరుణ్. ఆగస్టు 25న గాంఢీవధారి అర్జున విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సాక్షివైద్య హీరోయిన్ గా నటించింది. నాజర్, విమలారామన్, వినయ్ రాయ్, రోషిణి, అభినవ్ గోమతం తదితరులు కీలక పాత్రలు పోషించగా.. మిక్కి జే మేయర్ సంగీతం సమకూర్చాడు. గని ఫ్లాప్ తరువాత ఎన్నో ఆశలు పెట్టుకున్న తరువాత ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కి నిరాశనే మిగిల్చింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?

 మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

Visitors Are Also Reading