Home » మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన నాని మూవీలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ఏ మూవీ కోసం కూడా రెండు గంటల పాటు ఆ పని చేయలేదట మహేష్ బాబు. ఒకే ఒక్క సినిమా కోసం మహేష్ బాబు రెండు గంటల పాటు ఆ పని చేశారట. ఇంతకు మహేష్ బాబు చేసిన ఆ పని ఏంటి ? ఎందుకు అంతలా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా చేసిన భరత్ అనే మూవీలో మహేష్ బాబు తన తండ్రి మరణిస్తే.. తండ్రి నిర్వహించిన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతారు.  ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేసన్స్ పెడతారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఉండే ప్రతీ ఒక్కటి చాలా మందిని ఆకట్టుకుంది. అచ్చం సినిమా మాదిరిగానే బయట కూడా ఉంటే బాగుండు కదా అని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా మొత్తానికి హైలెట్ అయిన సన్నివేశం ఒకే ఒక్కటి.

Advertisement

అదే మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చిన స్పీచ్.. “ భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్దతో నిర్వహిస్తానని” అంటూ మహేష్ బాబు ఇచ్చే స్పీచ్ చాలా మంది ప్రజలను ఆకట్టుకుంది. ఈ స్పీచ్ నేర్చుకోవడం కోసం మహేష్ బాబుకి ఏకంగా రెండు గంటల సమయం పట్టిందట. తన సినీ కెరీర్ లో తొలిసారి ఓ డైలాగ్ కోసం రెండు గంటల సమయం తీసుకున్నది ఈ సినిమా కోసమేనట. ఈ చిత్రంలోని డైలాగ్ కోసం తనలో ఉండే రాజకీయ నాయకుడి గంభీరత్వం రావడం కోసం రెండు గంటల పాటు ట్రై చేశాక మొత్తం డైలాగ్ వచ్చిందట. ఇక భరత్ అనే నేను సినిమా సమయంలో ఈ డైలాగ్ కోసం మాత్రమే ఎక్కువ సమయం ఎక్కువ టేక్స్ తీసుకున్నారట మహేష్ బాబు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?

రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..?

Visitors Are Also Reading