Telugu News » Blog » ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ads

సాధారణంగా ఒక సినిమా విజయం సాధించాలంటే క్రమ శిక్షణ కచ్చితంగా ఉండాలి. ఆ సినిమా తీసే దర్శకుడికి, నిర్మాతకి, హీరో, హీరోయిన్స్ కి వివిధ శాఖల్లో పని చేసే ప్రతీ ఒక్కరికీ కూడా ఎంతో క్రమశిక్షణ చాలా అవసరం. కట్టుదిట్టంగా పని చేస్తేనే సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వస్తుంది. అలాంటి సినిమాల్లో 2004లో విడుదలైనటువంటి సినిమా ప్రేమిస్తే. ఈ చిత్రం ప్రేమ కథ చిత్రాలలోనే ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించినటువంటి విషాద ప్రేమకథకు ఇప్పటికీ అభిమానులున్నారు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. హీరోయిన్ గా నటించినటువంటి సంధ్యకి ప్రేమిస్తే చిత్రం మొదటిది.

Advertisement

premisthe-movie

 

మలయాళంలో జన్మించిన ఈమె తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రికీ పరిచయమైంది.ప్రేమిస్తే చిత్రంలో తన అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ అందాల తార. ఇక సినిమా తరువాత తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంది. అన్ని భాషలలో కలిపి దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించింది సంధ్య. తెలుగులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం చిత్రంలో చెల్లెలి పాత్రను పోషించింది.

Advertisement

Kadhal Sandhya

వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో నేచురల్ గా నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత సక్సెస్ ని కొనసాగించలేకపోయింది. దీంతో క్రమక్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరం అయింది సంధ్య. 2015లో చెన్నైకి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంధ్య. ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో చాలా సింపుల్ గా ఈ పెళ్లి వేడుక జరిగింది.  

Also Read :  వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?

Manam News

సంధ్య సోషల్ మీడియాలో కూాడా అసలు యాక్టివ్ గా ఉండడం లేదు. 2016 సెప్టెంబర్ లో సంధ్య దంపతులకు ఓ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆ తరువాత మరో సంతానం కలిగింది. ఇక ప్రస్తుతం సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటోంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తోంది ఈ తార. ఈమెకు పలు సినిమాల్లో  క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే అవకాశం వచ్చినప్పటికీ ఎన్ని అవకాశాలు వచ్చినా తోసిపుచ్చిందట. అయితే ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్ అక్క పాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట సంధ్య. భాగంగా ఇప్పటికే కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరోయిన్ అక్క పాత్ర పోషించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందట. 

Advertisement

Also Read :  బాలయ్య డైరెక్టర్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన చిరంజీవి… ఎందుకో తెలుసా..?