Home » వావ్‌.. సూప‌ర్ స్టార్ సినిమా నెల రోజుల ముందే సెన్సార్ పూర్తి..!

వావ్‌.. సూప‌ర్ స్టార్ సినిమా నెల రోజుల ముందే సెన్సార్ పూర్తి..!

by Anji
Ad

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా విడుదలకు వారం లేదా నాలుగైదు రోజుల ముందు మాత్రమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయిస్తారు. సినిమా విడుదల చాలా రోజులు ఉండగానే సెన్సార్ టాక్ బయటకు వస్తే సినిమాకు డ్యామేజ్ జరుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం. అందుకే సినిమా సిద్ధ‌మైనా కూడా సెన్సార్ కార్యక్రమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

Also Read :  Amrutham Serial: అమృతం సీరియల్ ని రాజమౌళి ఆయన భార్య ఎలా చూసేవారంటే ?

Advertisement

సెన్సార్ కార్యక్రమాలను జరపడం కోసం సినిమా విడుదల తేదీ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే సెన్సార్ జరిపిస్తారు. కానీ తమిళ సూపర్ స్టార్ విజయ్ బీస్ట్ సినిమా కు మాత్రమే రన్ లో రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. వచ్చేనెల పదమూడవ తారీకున విడుదల కాబోతున్న బీస్ట్ సినిమా కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సెన్సార్ చేసిన సభ్యులు సినిమాని ప్రశంసించారని సమాచారం అందుతోంది.

Advertisement


విజయ్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడని నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారట. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల మొదటి వారంలో షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా తెలుగు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం అందుతోంది. విజయ్ ఇప్పటివరకు తెలుగులో పెద్దగా సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు. ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా కేజిఎఫ్ 2 విడుదల కాబోతోంది. బీస్ట్ సినిమా ఆయనకు సక్సెస్ ను అందిస్తుందా అనేది చూడాలి.

Also Read : భార‌త్‌ను పొగిడిన పాక్ ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading