Home » Hyper Aadi: అమ్మో ఆది పేరిట ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. ఎంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

Hyper Aadi: అమ్మో ఆది పేరిట ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. ఎంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో హైపర్ ఆది కూడా మంచి గుర్తింపు సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన అంటే తెలియని వారు ఉండరు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది అనేక టీవీ షోలలో కూడా యాంకర్ గా చేస్తూ తనదైన కామెడీ పంచింగులతో దూసుకెళ్తున్నారు. అలాంటి హైపర్ ఆది ఏదైనా షోలో ఉంటే తప్పనిసరిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావిస్తారు.

also read:Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

Advertisement

అంతేకాకుండా సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన ధమాకా మూవీకీ ఆది డైలాగ్ రైటర్ గా వర్క్ చేయడం విశేషం. మొత్తానికి ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న హైపర్ ఆది.. చాలా కామన్ గా ఉంటూ బాగానే సంపాదించారట. ఆయన సంపాదన లక్షల నుండి కోట్లకు చేరిందని తెలుస్తోంది. వచ్చిన సంపాదనంతా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారట.

Advertisement

also read:“విక్రమ్” మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

హైదరాబాదులోనే రెండు అపార్ట్మెంట్స్ లో రెండు ఫ్లాట్స్, మణికొండ లో ఒక విల్లా ఆదికి ఉన్నాయట. అంతేకాకుండా హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేశారట. ఆది ఒంగోలు దగ్గరలో తన సొంత ఊరిలో 16 ఎకరాల పొలం కూడా కొన్నారని ఈ విధంగా ఆయన ఆస్తుల విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

also read:నిద్ర పట్టట్లేదా.. ఈ మంత్రం జపిస్తే చాలు గాఢ నిద్ర మీ సొంతం..!!

Visitors Are Also Reading