Home » తండ్రి అంటేనే త్యాగం..అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి..ఎంత పని చేశాడంటే..!!

తండ్రి అంటేనే త్యాగం..అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి..ఎంత పని చేశాడంటే..!!

by Sravanthi Pandrala Pandrala

నవ మాసాలు మోసి తల్లి మనకు జన్మనిస్తే, కడుపులో మోయకున్నా తన భుజాన ఎత్తుకొని తండ్రి ఏ కష్టం రాకుండా జీవిత కాలం పిల్లల్ని పెంచుతారు. పిల్లల కోసం ఆయన ప్రాణ త్యాగానికైనా వెనకాడరు అని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం ఈ తండ్రి. మరి ఆయన ఏం చేశారో ఇప్పుడు చూద్దామా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లా పరిధిలో ఉండే ట్రాన్స్పోర్ట్ నగర్ లో ప్రమోద్ గుప్తా దంపతులు నివసించేవారు. వీరికి ఒక్కతే కూతురు. ఆమె పేరు అనుష్క గుప్తా (17). ప్రమోద్ స్థానికంగా ఒక చిన్న దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అలా రోజు వచ్చిన డబ్బులతో చాలా హ్యాపీగా కుటుంబంతో జీవించేవాడు. కానీ అనుకోని రోడ్డు ప్రమాదం వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఐదు సంవత్సరాల క్రితం అనుష్క గుప్త రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడింది.

also read:IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!

కానీ వెన్నెముక పూర్తిగా దెబ్బ తినడంతో మంచానికే పరిమితమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా మంచానికే పరిమితం అవ్వడం తట్టుకోలేని తండ్రి తన కూతురు లేచి నడవాలని పొలం, ఇల్లు, దుకాణం మొత్తం అన్ని అమ్మి వైద్యం చేయించారు. చివరికి అప్పులు చేసి మందులు థెరపీలు చేయించాడు . అయినా నయం కాలేదు. కొంతమంది అధికారులు వచ్చి సాయం అందిస్తామని చెప్పిన ఇంతవరకు రూపు దాల్చలేదు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఇక చిన్న చిన్న పనులకు వెళ్లడం ప్రారంభించారు. కానీ ఆ డబ్బు సరిపోలేదు. ఇక లాభం లేదని ఇంట్లోకి సరుకులు తేవడం కోసం తరచూ తన రక్తాన్ని అమ్మి సరుకులు తెచ్చేవాడు.

also read:“విక్రమ్” మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

రాను రాను పరిస్థితులు మారి ఆయన మరింత శక్తిహీనుడు అయిపోయాడు. కూతురి కోసం నేనేం చేయలేకపోతున్నానని నిరాశతో మానసికంగా కృంగిపోయాడు. చివరికి తన కూతురికి ఫోన్ చేసి తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని ఫోన్ కట్ చేశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన కూతురు స్వయంగా తెలియజేసింది. నాకు ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు కానీ మాట తప్పారు. వాళ్ల కోసం మా నాన్న కాళ్లరిగేలా తిరిగాడు. అయినా ఎవరు పట్టించుకోలేదు. మా ఇంట్లో సరుకులు లేకుంటే రక్తాన్ని అమ్మి సరుకులు తెచ్చాడు. చివరికి తన ప్రాణాలే విడిచి పెట్టాడు అంటూ ఆ బెడ్ లో ఉన్న బిడ్డ కన్నీటి పర్యంతమైంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని ఏంటో తెలియజేయండి.

also read:Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Visitors Are Also Reading