Telugu News » అన్న క‌ల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఏమి చేస్తున్నాడో తెలుసా..?

అన్న క‌ల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఏమి చేస్తున్నాడో తెలుసా..?

by Anji

జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు ప్ర‌స్తుతం ఓ బ్రాండ్‌. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాల‌ను కూడా అదే స్థాయిలో చేయ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నాడు. అందులో భాగంగానే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 30, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 31వ చిత్రంలో న‌టిస్తున్నాడు. నిన్న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు విడుద‌ల చేసి మేక‌ర్స్ షూటింగ్ ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

Ads

ఇక ఈ రెండు సినిమాల‌కు తార‌క్ అన్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాత కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాల గురించి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ రెండు సినిమాల‌కు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా రెమ్యున‌రేష‌న్ తీసుకోను అని చెప్పాడ‌ట‌. అన్న సినిమా కాబ‌ట్టి ఇంత త్యాగం చేస్తున్నాడ‌ని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు దాదాపు రూ.50కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా త‌రువాత పారితోషికం పెంచాలి కానీ అస్స‌లు డ‌బ్బు తీసుకోక‌పోవ‌డం ఏమిట‌ని మ‌రికొంద‌రూ అనుమాన‌ప‌డుతున్నారు. క‌ల్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం నిర్మాత‌గా వెనుక‌బ‌డి ఉన్నాడ‌న్న విష‌యం తెలిసిందే.

నంద‌మూరి ఆర్ట్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి దిగిన నంద‌మూరి వార‌సుడు ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా మారుతున్నారు. దీంతో అన్న ప్రొడ‌క్ష‌న్ స్థాయిని పెంచుకోవ‌డం ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ కాకుండా బిజినెస్‌లో షేర్ తీసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు వార్త వినిపిస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత అనేది తెలియాల్సి ఉంది. బిజినెస్ షేర్ కూడా అంత త‌క్కువ ఏమి కాదు. ఈ సినిమాలు హిట్ అయితే షేర్స్ బాగా వ‌స్తే ప‌ర్లేదు, ఒక‌వేళ సినిమా ఏదైనా తేడా వ‌చ్చిందంటే.. హీరో రెమ్యున‌రేష‌న్ లేక‌పోవ‌డంతో క‌ల్యాణ్ రామ్ సేఫ్ అయిన‌ట్టే. ఇలాంటి నిర్ణ‌యం ఎన్టీఆర్ తీసుకున్న‌ట్టు స‌మాచారం వినిపిస్తోంది. ఇక ఇందులో వాస్త‌వం ఎంత అనేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఓపిక ప‌ట్టాల్సిందే.

Also Read : 

Chanakya Niti : ఈ 5 అనుస‌రిస్తే వారికి ల‌క్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయ‌ట‌..!

అల్లు అర్జున్ కూతురు అర్హ పై ట్రోలింగ్‌.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

 


You may also like