Telugu News » అల్లు అర్జున్ కూతురు అర్హ పై ట్రోలింగ్‌.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

అల్లు అర్జున్ కూతురు అర్హ పై ట్రోలింగ్‌.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

by Anji

సెల‌బ్రిటీలు ప్ర‌స్తుతం ఎంత పాపుల‌ర్ అవుతున్నారో వారి పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యామిలీ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అల్లుఅర్జున్‌ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం కూడా తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వారి పుట్టిన రోజుతో పాటు పిల్ల‌లు చేసే సంద‌డితో ప‌లు విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అల్లుఅర్జున్ అత‌ని భార్య స్నేహ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అల్లుఅర్జున్ గారాల ప‌ట్టి అర్హ చేసే అల్ల‌రి ఏవిధంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే సంద‌డికి సంబందించిన వీడియోలు వైర‌ల‌వుతూనే ఉన్నాయి.

Ads


ఇక తాజాగా స‌మంత కీల‌క పాత్ర పోషిస్తున్న శాకుంత‌లం సినిమాతో వెండి తెర‌కు ఎంట్రి ఇస్తోంది అల్లు అర్హ‌. తొలి సినిమాలోనే త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌మంత తెలిపిన విష‌యం విధిత‌మే. ఇదిలా ఉండ‌గా.. అల్లు అర్హ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత చిన్న వ‌య‌సులోనే చెస్‌లో శిక్ష‌ణ ఇస్తూ.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అతి చిన్న వ‌య‌సులో ప్ర‌ఖ్యాత నోబుల్ అవార్డును అందుకుంది. ఇన్ని స్పెషాలిటీ ఉన్న అర్హ చేసిన ఓ చిన్న ప‌నిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఈ చిన్నారిపై నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. అల్లుఅర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంలో మ‌ధ్య‌లో అల్లు అర్హ కూడా వ‌చ్చింది. అప్పుడు యాంక‌ర్ చిన్నారి నీ పేరు ఏమిటి అని అడ‌గ్గా.. ఆ మాట‌కు అర్హ అల్లు అర్హ రెడ్డి అని స‌మాధానం చెప్పింది. దీంతో అర్హ చెప్పిన స‌మాధానం విని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఈ విష‌యంపై నెటిజ‌న్స్ స్పందిస్తూ.. పిల్ల‌ల‌కు ఏం నేర్పిస్తున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ లేదంటూనే అర్హారెడ్డిగా పేరు పెట్టుకున్నారు. డాడి లాస్ట్ నేమ్‌తో పాటు మామ్ క్యాస్ట్ నేమ్ హా అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ విష‌యంపై అల్లు అర్జున్ ఆయ‌న భార్య స్నేహారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read : 

జ‌యం సినిమా స‌మ‌యంలో స‌దాను తేజ కొడితే నితిన్ ఫైర్ అయ్యాడా..?

ప్ర‌ణ‌య్ త‌ర‌హా క‌థ మ‌రో యువ‌కుడికి.. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌ని..!


You may also like