Home » హీరోయిన్ కాకుండా ఉంటే నిధి అగ‌ర్వాల్ ఏం చేసేదో తెలుసా..?

హీరోయిన్ కాకుండా ఉంటే నిధి అగ‌ర్వాల్ ఏం చేసేదో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అందం, అభిన‌యంతో మెప్పిస్తున్న యువ‌త‌రం క‌థానాయిక‌ల్లో నిధి అగ‌ర్వాల్ ఒక‌రు అని చెప్పవ‌చ్చు. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన స‌వ్య‌సాచి సినిమాల ఆమె ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఆ త‌రువాత మిస్ట‌ర్ మ‌జ్ఞు, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాలతో అల‌రించింది. ఈమెకు అందం ఉన్న‌ప్ప‌టికీ అదృష్టం మాత్రం కలిసి రావ‌డం లేద‌నే చెప్ప‌వ‌చ్చు. సోష‌ల్ మీడియా లో భారీ ఫాలోయింగ్ ఉన్నా అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు. సూప‌ర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్న‌ప్ప‌టికీ అనుకున్నంత‌గా క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పాలి. కేవ‌లం తెలుగులోనే కాదు.. త‌మిళంలో కూడా ఈమెకు నిరాశే మిగిలింది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ స్టార్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తోంది నిధి అగ‌ర్వాల్.

Advertisement

Advertisement

ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ ఆశ‌ల‌న్నీ ప‌వ‌న్ సినిమాపైనే పెట్టుకుంది. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి విడుద‌లైన నిధికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా త‌రువాత నిధికి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని ప‌లువ‌వురు పేర్కొంటారు. ఇక ఈమె హీరోయిన్ కాకుంటే ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయ్యేదానిని అంటూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల ఇన్ స్టాలో అభిమానుల‌తో ముచ్చ‌టించిది నిధి అగ‌ర్వాల్. వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది.

Also Read : 100 కోట్లతో వస్తున్న బాలయ్య కొడుకు..!


ముఖ్యంగా తాను వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తాన‌ని తెలిపింది. అంతేకాదు.. తాను ఇంట‌ర్ స్టేట్ ఛాంపియ‌న్ అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాకుంటే ఏం చేసే వారు అని ప్ర‌శ్నించ‌గా.. న‌టిగా స‌క్సెస్ కాకుంటే తాను ఇంట్లో ఊరికే కూర్చొనిచ్చే వారు కాదు అని వెల్ల‌డించింది. క‌చ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయాల్సి ఉండేది. ఒక‌వేళ హీరోయిన్‌గా స‌క్సెస్ కాకుంటే ఫ్యాష‌న్ బ్రాండ్ ప్రారంభించే దానిని అని వివ‌రించింది. త‌న‌కు ఫ్యాష‌న్ డిజైనింగ్ అస‌లు ప‌రిచ‌యం లేద‌ని.. ఆ రంగంలో శిక్ష‌ణ తీసుకునే దానిని అని వెల్ల‌డించింది.

Also Read :  ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి సీఎం అయితే ఆ పనులు చేస్తా..!

Visitors Are Also Reading