Home » 100 కోట్లతో వస్తున్న బాలయ్య కొడుకు..!

100 కోట్లతో వస్తున్న బాలయ్య కొడుకు..!

by Azhar
నందమూరి ఫ్యామికి రెండు తెలుగు రాష్ట్రలో ఉండే అభిమానులే వేరు. మిగిలిన అన్ని కుటుంబాల ఫ్యామిలీస్ కంటే నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. అయితే ఇప్పటికి నందమూరి ఫ్యామిలీ నుండి కేవలం ముగ్గురు నలుగురు హీరోలు మాత్రమే టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక అందులో ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరోగా.. నేషనల్ వైడ్ గా తన సత్తాను నిరూపించుకున్నాడు.
అయితే ఇప్పుడు నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలు అనేవి చేస్తున్న.. ఆయన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ తెగ వేట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యే మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి వార్తలు అనేవి ఉపందుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన మరో వార్త అనేది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
అదే మోక్షజ్ఞ మొదటి సినిమా బడ్జెట్. ఏకంగా మోక్షజ్ఞ మొదటి సినిమా అనేది 100 కోట్లతో రానుంది అని తెలుస్తుంది. బాలయ్య అంటే బాగా అభిమానం ఉన్న మన టాలీవుడ్ టాప్ నిర్మాత ఒక్కరు.. మోక్షజ్ఞతో సినిమా అనేది చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఆ నిర్మాత అలాగే బాలయ్య కలిసి మోక్షజ్ఞకు తగ్గిన ఓ కథను సిద్ధం చేయమని.. టాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్లకు చెప్పినట్లు తెలుస్తుంది. మంచి కథ అనేది దొరికిన వెంటనే.. మోక్షజ్ఞ కొత్త సినిమా అనేది ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.
Visitors Are Also Reading