Home » కాంతారా సినిమా గురించి కంగ‌నా ర‌నౌత్ ఏమందో తెలుసా ?

కాంతారా సినిమా గురించి కంగ‌నా ర‌నౌత్ ఏమందో తెలుసా ?

by Anji
Ad

 

క‌న్న‌డ ద‌ర్శ‌కుడు రిష‌బ్‌శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి.. స్వ‌యంగా న‌టించిన సినిమా కాంతారా. ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రం గురించి చ‌ర్చించుకోవ‌డం విశేషం. ఈ సినిమా అతి త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి భారీ బ‌డ్జెట్ సినిమాల రికార్డుల‌ను సైతం తిరగ‌రాస్తోంది. తొలుత‌ క‌న్న‌డ‌లోనే విడుద‌ల చేశారు. అక్క‌డ సూప‌ర్ హిట్ కావ‌డంతో హిందీ, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల చేసి మార్కెట్‌ని పెంచుకున్నారు నిర్మాత‌లు. దేశ‌వ్యాప్తంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం ఈ సినిమా అద్భుత‌మని కొనియాడుతున్నారు.

Also Read : కాంతారా సినిమాతో వారంద‌రికీ ప్ర‌తినెల రూ.2వేలు..!

Advertisement

తాజాగా ఈ సినిమాను చూసిన ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించింది. ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అనుభ‌వాన్ని పంచుకుంది. ఇప్పుడే మా కుటుంబంతో క‌లిసి కాంతార చిత్రం చూశాను. ఇప్ప‌టికీ కూడా నా శ‌రీరం ఇంకా వ‌ణుకుతూనే ఉంది. ఇది ఒక అద్భుత‌మైన అనుభ‌వం. ఇందులో సాంప్ర‌దాయం, జాన‌ప‌ద క‌థ‌లు, దేశీయ స‌మ‌స్య‌ల స‌మ్మెళ‌న‌మే ఈ కాంతార చిత్రం. రిష‌బ్ శెట్టికి హ్యాట్సాప్‌. కాంతారా సినిమాలో అద్భుతంగా న‌టించాడు.

Advertisement

Also Read : తల్లిదండ్రుల దగ్గర “పెళ్లి” మాట రాగానే అమ్మాయిల ఆలోచన ఈ విధంగా ఉంటుంద‌ట‌..!

ముఖ్యంగా ప్ర‌కృతి అందాల‌ను చూపించిన విధానం, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన తీరు చాలా బాగుంది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడ‌లేద‌ని థియేట‌ర్ లో ప్రేక్ష‌కులు అంటున్నారు. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను అందించిన టీమ్ కి ధ‌న్య‌వాదాలు. మ‌రో వారం రోజుల పాటు నేను ఈ అనుభూతితోనే ఉంటాన‌నిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. వెంట‌నే మ‌రోపోస్ట్ షేర్ చేస్తూ వ‌చ్చే ఏడాది కాంతార నామినేట్ అవ్వ‌డం ప‌క్కా అని పేర్కొంది. ఇంత‌కంటే గొప్ప చిత్రాలు రావ‌చ్చు కానీ మ‌న దేశ సంస్కృతినీ, అద్భుతాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిచ‌యం చేసే కాంతార వంటి చిత్రాల‌ను త‌ప్ప‌కుండా ఆస్కార్‌కి నామినేట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది.

Aalso Read : “ఫిదా” సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌మ్ముడు ఎవ‌రో తెలుసా…? సినిమా ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..?

 

Visitors Are Also Reading