Home » ముకేశ్ అంబానికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ?

ముకేశ్ అంబానికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అపర కుబేరులలో ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆహారపు అలవాట్లు చాలా సరళమైన అభిరుచిని కలిగి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదు అయిన ఇల్లు యాంటిలియోలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ముకేష్ అంబానీ. గుజరాతీగా స్థానిక ఆహార పదార్థాలంటే చాలా ఇష్టమట. ఆయనకు ఇష్టమైన పలు ఆహార పదార్థాలను అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. ఇంట్లో వండినటువంటి ఆహార పదార్థాలనే ఎక్కువగా ఇష్టపడుతారట. 

Also Read :  అమెరికాలో హీరోయిన్ లయ ఏ ఉద్యోగం చేస్తున్నారు… ఆమె నెల జీతం ఎంతో తెలుసా!

Advertisement

ముఖ్యంగా ముకేష్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ భేల్, దహి బటాతా పూరి. ఇంట్లో తయారు చేసిన ఈ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటారని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. రెండు డిసెష్ ఎల్లప్పుడు ఫేవరేట్ గా ఉంటాయని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇంత బిజీ జీవితంలో కూడా కుటుంబం కోసం సమయాన్ని కేటాయించడంతో పాటు దంపతులిద్దరూ నైట్ డిన్నర్ కి వెళ్తారని చెప్పారు. అప్పుడప్పుడు బయటికి వెళ్లి స్ట్రీట్ ఫుడ్స్ తింటాం అని చెప్పారు. 

Advertisement

Also Read :  జ్ఞాపక శక్తిని పెంచే ఈ పొడిని తింటే ఏ విషయాన్ని కూడా మరిచిపోరు..!

ఇప్పటికీ మేము ఒకరితో ఒకరు చాలా ప్రేమలో ఉన్నాం. ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకొని వెళ్తాం. అర్థరాత్రి కూడా ఒక కప్పు కాపీ కోసం వెళ్తాం. సీ లాంజ్ కి, డే ప్లాన్ అయితే స్వాతి స్మాక్స్ కి వెళ్తాం. భేల్ లేదా దహి బటాతా పూరి తింటాం’ అని చెప్పారు. ముకేష్ అంబానీ, నీతా అంబానీ ముంబయిలోని యాంటిలియా భవనంలో నివాసముంటారు. అంబానీలు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేందుకు ఇష్టపడుతారు. ఇంగ్లాండ్ లోని బకింగ్ హామ్ ప్యాలస్ తరువాత ముంబయిలోని యాంటిలియా రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దాని విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి. యాంటిలియా భవనం తరువాత స్థానంలో రేమండ్స్ అధినేత భవనం నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అనీల్ అంబానీ నివాసం సైతం ముకేష్ అంబానీ యాంటిలియాకు సమీపంలోనే ఉంటుందట. చాలా మంది కుబేరుల ఇళ్లు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి.  

Also Read :  ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్ల‌ను పెళ్లి చేసుకుంటే మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తార‌ట‌…అవేంటంటే..?

Visitors Are Also Reading