Home » ఆర్ఆర్ఆర్ అని గూగుల్ లో టైప్ చేస్తే ఏం వ‌స్తుందో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ అని గూగుల్ లో టైప్ చేస్తే ఏం వ‌స్తుందో తెలుసా..?

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎలాంటి అంచ‌నాల‌ను క్రియేట్ చేసిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. ఓ వైపు అగ్ర ద‌ర్శ‌కుడు, మ‌రోవైపు ఇద్ద‌రూ స్టార్ హీరోలు క‌లిసి న‌టించ‌డంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ హైప్ మ‌ధ్య విడుద‌ల చేయ‌గా.. తొలి రోజే అదిరిపోయే టాక్ వినిపించింది.


విడుద‌లైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ సినిమాను చూసేందుకు థియేట‌ర్ల వద్ద‌కు క్యూ క‌ట్టారు. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌డంతో ఈ చిత్రం ప‌లు రికార్డుల‌ను క్రియేట్ చేసి త‌న స‌త్తా చాటింది. ఇక RRR సినిమాను ZEE 5 లో మే 20 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేశారు. ఇప్ప‌టికే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మ‌రో ఓటీటీ యాప్ లోకి కూడా రానున్న‌ది. ప్ర‌స్తుతం మ‌రో స్ట్రీమింగ్ యాప్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కి వ‌చ్చింది. ఈ చిత్రం ద‌క్షిణాది భాష‌ల్లోనే మ‌ళ్లీ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రానికి ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

Advertisement

Advertisement


ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సెర్చ్ ఇంజిన్లో జ‌స్ట్ RRR అని టైప్ చేసి సెర్చ్ చేయ‌గానే కింద స‌మాచారంతో పాటు హీరోల గుర్రం, బైకు ఎమోజీలు యానిమేష‌న్లో అలా స్లైడ్ అవుతూ వెళ్లిపోతూ క‌నిపిస్తున్నాయి. ఈ స‌ర్‌ప్రైజింగ్ అంశాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకొని థాంక్స్ చెబుతున్నారు. ఈ స‌ర్ ప్రైజ్‌తో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 1150 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అమెరికాలో ఓ రేంజ్లో అద‌ర‌గొట్టింది.

Also Read : 

లాల్ సింగ్ చ‌డ్డాలో నాగ‌చైత‌న్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నార‌నే విష‌యం మీకు తెలుసా..?

నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

 

Visitors Are Also Reading