Telugu News » Blog » లాల్ సింగ్ చ‌డ్డాలో నాగ‌చైత‌న్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నార‌నే విష‌యం మీకు తెలుసా..?

లాల్ సింగ్ చ‌డ్డాలో నాగ‌చైత‌న్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నార‌నే విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ads

అమీర్ ఖాన్ న‌టించిన తాజా మూవీ లాల్ సింగ్ చ‌డ్డా.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌రువాత అమీర్ ఖాన్ నుంచి వ‌చ్చిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా ప్రమోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో చేశారు అమీర్ ఖాన్‌. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పించారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో అక్కినేని నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య బోడి బాల‌రాజు పాత్ర‌లో న‌టించి మెప్పించారు.

Ads

ఇక భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. అయితే నాగ‌చైత‌న్య న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ నాగ‌చైత‌న్య న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఈ సినిమాలో ముందుగా నాగ‌చైత‌న్య పాత్ర‌ను ఎవ‌రినీ అనుకున్నారంటే..? స్టార్ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని తొలుత బాల‌రాజు పాత్ర కోసం అనుకున్నార‌ట‌. అమీర్ ఖాన్ విజ‌య్ సేతుప‌తిని ఇందుకోసం సంప్ర‌దించార‌ట‌. విజ‌య్ సేతుప‌తి కూడా ఓకే చెప్పార‌ట‌.

Ads

అయితే అప్ప‌టికే విజ‌య్ సేతుప‌తి చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ రోల్స్ చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో పాటు, ఉప్పెన సినిమాతో విజ‌య్ సేతుప‌తి బిజీగా ఉన్నార‌ట‌. ఇక ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ను విజ‌య్ సేతుప‌తి మిస్ చేసుకున్నాడు. విజ‌య్ సేతుప‌తి ఈ పాత్ర చేసుంటే ఆయ‌న త‌ప్ప‌కుండా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేవారు అంటున్నారు అభిమానులు. యంగ్ హీరో నాగ‌చైత‌న్య కూడా ఈ పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. త‌న న‌ట‌న‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. చైతూ న‌ట‌న‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కులంద‌రూ ఫిదా అవుతున్నారు.

Also Read : 

తాత అల్లు రామ‌లింగ‌య్య ఫోటోను పంచుకున్న అల్లుఅర్జున్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

Ad

షిర్డీ సాయినాథుడి పై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!