Home » పురుషులకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

పురుషులకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా చాలా మందికి వారి భ‌విష్య‌త్ ఎలా ఉంటుంద‌నేది ముందే తెలుసుకోవాల‌ని ఉంటుంది. ఇందుకోసం పురాత‌న కాలం నుంచి మ‌న పూర్వీకులు ఒక ప‌ద్ద‌తిని ఉప‌యోగిస్తున్నారు. పుట్టుమ‌చ్చ‌ల శాస్త్రం కూడా ఒక‌టి ఉంది. మ‌న శరీర భాగాల‌పై ఉండే పుట్టుమ‌చ్చ‌ల స్థానాన్ని బ‌ట్టి వారి జీవితం ఏవిధంగా ఉంటుందో ఇలానే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా పుట్టుక‌తో వ‌చ్చిన వాటిని పుట్టుమ‌చ్చ‌లు అంటారు. కొన్ని సంద‌ర్భాల్లో మ‌నిషిని గుర్తించ‌డానికి కూడా వీటిని ఉప‌యోగిస్తారు. స్త్రీల‌కు పురుషుల‌కు పుట్టుమ‌చ్చ‌ల వ‌ల్ల శుభ‌, అశుభ ఫ‌లితాలుంటాయి. పుట్టుమ‌చ్చ‌లు అనేవి అంద‌రికీ ఒకేవిధంగా ఉండ‌వు. వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా పురుషుల‌కు త‌ల‌పై పుట్టుమ‌చ్చ ఉంటే వారికి కొద్దిగా గ‌ర్వం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తీది భూత‌ద్దంలో పెట్టి ప‌రిశీలిస్తారు. నుదుటి మీద పుట్టుమ‌చ్చ ఉన్న‌వారికి స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది.

Advertisement

పుట్టుమ‌చ్చ నుదుటి మీద ఉండ‌గా అలాంటి వారు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా రాణిస్తారు. నుదుటి కింద పుట్టుమ‌చ్చ ఉంటే ఉన్న‌త ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉంటారు. రెండు క‌నుబొమ్మ‌ల మ‌ధ్య పుట్టుమ‌చ్చ ఉంటే వారు దీర్ఘాయుషులై ఉంటారు. పుట్టుమ‌చ్చ క‌నుక కుడి క‌నుబొమ్మ మీద ఉంటే పెళ్లి త‌రువాత ధ‌నం క‌లిసి వ‌స్తుంది. వారి దాంప‌త్యం చ‌క్క‌గా సాగుతుంది. ఎడ‌మ క‌న్ను మీద పుట్టుమ‌చ్చ ఉంటే అలాంటి వారు క‌ష్ట‌ప‌డేత‌త్వం క‌లిగి ఉంటారు. ఇక ముక్కుమీద పుట్టుమ‌చ్చ ఉంటే పురుషుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ ఉండ‌దు. రెండు చెవుల మ‌ద ఎక్క‌డ పుట్టుమ‌చ్చ ఉన్నా కూడా ధ‌న‌వంతులు అవ్వ‌డంతో పాటు స‌మాజంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు క‌లిగి ఉంటారు. పెద‌వుల పుట్టుమ‌చ్చ ఉన్న వారికి కొంచెం ఈర్ష్యా భావం ఉంటుంది. అదేవిధంగా చ‌మ‌త్కారంగా మాట్లాడ‌గ‌ల‌రు. నాలుక మీద పుట్టుమ‌చ్చ ఉన్న వారు మంచి జ్ఞానం క‌లిగి ఉండి న‌లుగురిలో చ‌మ‌త్కారంగా మాట్లాడ‌గ‌ల‌రు.

Advertisement

పురుషుల్లో బుగ్గ‌మీద పుట్టుమ‌చ్చ ఉంటే వారు రాజ‌కీయాల్లో మంచిగా రాణించ‌గ‌ల‌రు. పురుషులకు గ‌డ్డంలో పుట్టుమ‌చ్చ ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని క‌లిగి ఉంటారు. మెడ మీద పుట్టుమ‌చ్చ క‌లిగిన పురుషుల‌కు భార్య ద్వారా ధ‌న‌లాభం క‌లుగుతుంది. భుజం మీద పుట్టుమ‌చ్చ ఉన్న‌వారు క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటారు. పొట్ట‌మీద పుట్టుమ‌చ్చ ఉన్న‌వారు ఎక్కువ‌గా భోజ‌నం చేస్తారు. పొట్ట కింద పుట్టుమ‌చ్చ ఉన్న వారు వారికి క‌ష్టాలు బాగా ఉంటాయి. అదేవిధంగా పుట్టుమ‌చ్చ నాభి లోప‌ల ఉన్న వారికి ధ‌న లాభం క‌లుగుతుంది. ఎడ‌మ తొడ‌పై పుట్టుమ‌చ్చ ఉన్న వారికి Shrum గారంపై ఆస‌క్తి ఎక్కువ ఉంటుంది. కుడి తొడ‌పై పుట్టుమ‌చ్చ ఉంటే ఆక‌స్మిక ధ‌న లాభం క‌లుగుతుంది. పిక్క‌ల‌పై పుట్టుమ‌చ్చ ఉన్న‌ట్ట‌యితే మనం చేసే ప‌నిలో ఆల‌స్యం క‌లిగి ఉంటారు. పాదాల‌పై పుట్టుమ‌చ్చ ఉంటే ఆక‌స్మిక అనారోగ్యం, మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశ‌ముంటుంది. పురుషుల‌కు పుట్టుమ‌చ్చ‌ల‌ను బ‌ట్టి భ‌విష్య‌త్ ఏవిధంగా ఇలా తెలుసుకోవ‌చ్చు.

Also Read : 

NTR అడ‌విరాముడు షూటింగ్ విశేషాలు. షూటింగ్ లో జ‌రిగిన ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన హీరోయిన్స్!

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Visitors Are Also Reading