Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 27.07.2022: మేషం

 

వృత్తి ,ఉద్యోగ వ్యాపారాల్లో అంచ‌నాల‌ను అందుకుంటారు. విందు, వినోద ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధుమిత్రుల స‌హ‌కారం లేక‌పోయిన‌ప్ప‌టికీ కొన్ని ప‌నుల‌ను ప్రారంభించి పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌యాణాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Today rashi phalau in telugu: మిథునం

నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. ధ‌న‌ధాన్య వృద్ధి ఉంది. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

మీ ప‌ని తీరుతో మీ పై అధికారుల మ‌న‌సుల‌ను గెలుస్తారు. గౌర‌వ స‌న్మానాలు అందుకుంటారు. బంధువుల‌తో విబేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ శ్ర‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూల‌మైన ఓ నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం. కుటుంబ వాతావ‌ర‌ణం అంతా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొన్ని సంఘ‌ట‌న‌లు కాస్త మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలున్నాయి. ఇష్టుల‌తో మ‌రుపురాని క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. మాన‌సిక ఆనందాన్ని క‌లిగి ఉంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు సొంతం అవుతాయి. గిట్ట‌ని వారు త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు. చిన్న చిన్న అంశాల‌ను పెద్ద‌విగా చేసుకోవ‌డం స‌రికాదు.

Today rashi phalau in telugu :  మీనం

స్థిర‌మైన చిత్తంతో ముందుకు సాగితే శుభ ఫ‌లితాలు క‌ల‌వు. స‌మ‌స్య‌గా అనిపించిన అంశాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాలు శుభ‌ప్ర‌దం.

Visitors Are Also Reading