Home » తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Bunty

తాబేలు అనేది నీటిలో నివసించే జంతువు. తాబేలుని చాలామంది శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో నీటి తాబేలును పెట్టుకుంటారు. తాబేలు ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, సంపద పెంచుతుందని చాలామంది విశ్వసిస్తారు. అయితే తాబేలు ఉంగరాన్ని ధరించే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని చెప్పలేము. హిందూ పురాణాల ప్రకారం విష్ణు యొక్క పది అవతారాలలో కూర్మ అవతారం ఒకటి. లక్ష్మీదేవి కూడా నీటి నుంచి పుట్టింది. కాబట్టి లక్ష్మీదేవిని భక్తితో పూజించిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. తాబేలు గుర్తు ఉంగరం ధరించిన వారి జీవితంలో విజయం సాధిస్తారు. అయితే తాబేలు ఉంగరాన్ని ఇష్టం వచ్చినట్లు పెట్టుకోకూడదు. అది పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అందుకే తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం…

తాబేలు ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని పురాతన కాలం నుంచి నమ్ముతారు. అయితే ఇది చాలా సున్నితమైన విషయం. తాబేలు ఉంగరాన్ని మధ్య వేలుకు లేదా చూపుడు వేలుకు పెట్టుకోవాలి. ఈ ఉంగరాన్ని కుడి చేతికి ధరించాలి. శుక్రవారం లక్ష్మీదేవికి పవిత్రమైన రోజుగా పరిగణిస్తాం. ఈరోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనుక్కొని పెట్టుకోవడం ఉత్తమం. తాబేలు ముఖం మనకు ఎదురుగా ఉండాలి. వ్యతిరేక దిశలో ఉండకూడదు. ఉంగరాన్ని పెట్టుకునే ముందు పచ్చి పాలలో నానబెట్టి ధరించే ముందు లక్ష్మీదేవి చిత్రం ముందు పూజించాలి. ఇలా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉంగరాన్ని పదే పదే తీయవద్దు. తాబేలు ఉంగరం అసలు ఎందుకు ధరించాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం…

1. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల సంపద పెరుగుతుంది. తాబేలు ఉంగరాన్ని ఎవరైతే సరిగ్గా పెట్టుకుంటారో వారికి సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో నష్టపోయినట్లైతే ఉంగరాన్ని ధరించడం వల్ల లాభాలను పొందుతారు.

2. విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి. విష్ణు మరియు లక్ష్మీదేవితో దగ్గర సంబంధం కలిగి ఉండడం కోసం ఈ ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కోరుకున్న పనులు తీరుతాయి.

3. మంచి ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో సానుకూలత, ప్రశాంతత కోసం తాబేలు ఉంగరాన్ని ధరించాలి. ఈ ఉంగరం వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ, బంధాల విలువను కూడా పెంచుతుంది. చాలామందికి కొన్ని విషయాల గురించి తెలియదు. కాబట్టి తాబేలు ఉంగరం ధరించే ముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

సింగర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు వీళ్లే ..!

మీ కలలో ఇవి కనుక కనపడ్డాయి అంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది!

అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!

Visitors Are Also Reading