Home » పుచ్చకాయ తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా ?

పుచ్చకాయ తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా ?

by Anji
Ad

పుచ్చకాయ అంటే దాదాపు అందరికీ ఇష్టమే ఉంటుంది. దీని వల్ల చాలా ప్రయోజనాలుంటాయని అందరికీ తెలిసిందే. మన శరీరంలో వేడిని తగ్గించి ఇది చల్లదనాన్ని పరుస్తుంది. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్థిని తీర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఎండాకాలంలో మన శరీరంలో వాటర్ లెవల్స్ తగ్గిపోతుంటాయి. డీ హైడ్రేషన్ నుంచి ఇది రక్షిస్తుంది. 

Also Read :  మ‌నోజ్ పెళ్లిలో విష్ణు తీరు చూసి అవాక్కవుతున్న నెటిజ‌న్లు..ఇలా చేశావేంటి అంటూ ఫైర్.?

Advertisement

శరీరంలో వాటర్ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బీ6, విటమిన్ సి వంటివి పుష్కలంగా లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. 

Also Read :  నల్ల మిరియాలతో బరువు తగ్గవచ్చనే విషయం మీకు తెలుసా ? 

 

పుచ్చకాయ వల్ల లాభాలు :

Advertisement

  • పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది. 
  • మధుమేహం ఉన్న వారికి మంచి ఔషదంగా పని చేస్తుంది. 
  • గర్భిణి మహిళలకు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. 
  • కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు,తేనెలో కలిపి పుచ్చకాయ తింటే చాలా మంచిది. 
  • డీ హైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. 
  • శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపించడానికి తోడ్పడుతుంది.
  • ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంది. 
  • బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుచుతుంది. 
  • క్యాన్సర్ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయకు ఉంది. 
  • నాడి వ్యవస్థ పని తీరును మెరుగుపరుచుతుంది. దీంతో మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. 
  • కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడే వారికి పుచ్చకాయ ఎంతో మంచిది. 
  • కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయను తింటే కీళ్ల నొప్పులు, వాతం లాంటి రోగాలు నయం అవుతాయి. 

Also Read :  నిద్ర పట్టని వారికి శుభవార్త.. నిద్రలేమి చాలా మంచిది..!

Visitors Are Also Reading