దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కొన్నిసందర్భాల్లో వినియోగిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తరువాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కు చెదరకుండా ఉండటం చూసే ఉంటారు. దీనిని ఇప్పుడు నివారించడానికి ప్రభుత్వం కొత్త యంత్రాగాన్ని అమలు చేస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ వ్యక్తి మరణించిన తరువాత అతని ఆధార్ కార్డును డియాక్టివేట్ చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు.
Advertisement
Also Read : ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసిన హీరో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Advertisement
సరికొత్త విధానంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరణానికి సంబంధించిన అఫిడవిట్ ఇచ్చిన తరువాత అతని ఆధార్ కార్డును డియాక్టివేట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఏ పౌరుడు మరణించి తప్పనిసరిగా జనన మరణ రికార్డులో నమోదు చేయబడాలి. మరణాన్ని నమోదు చేసేటప్పుడు వ్యక్తి ఆధార్ నెంబర్ తప్పనిసరి. మరణ దృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ఆధార్ కార్డు డియాక్టివేట్ చేయబడుతుంది. ఇప్పుడు అమలులోకి రానున్నది. అలాంటి వ్యవస్థ కోసం మొదటి ప్రతిపాదనను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చేసింది. మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు ఆధార్ పత్రాలను పొందడం గురించి UIDAI ని సంప్రదించారు. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును తొలగించేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.
Also Read : ఆయన మగతనంతో నాకేం సంబంధం…వైరల్ అవుతున్న సురేఖవాణి వీడియో..!
ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డుకు పత్రాలను జోడించడానికి జూన్ 14 వరకు అనుమతి ఉంది. ఉచిత సేవ ఆధార్ పోర్టల్ లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ కోసం 25 రూపాయల ఫీజు వసూలు చేసే వారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతీ పదేళ్లకోసారి తమ రికార్డులను అప్ డేట్ చేయాలని కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ID రుజువు, చిరునామా రుజువు పత్రాలను సమర్పించాలి. వీటిని ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆధార్ పోర్టల్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. జూన్ 14 తరువాత రుసుము చెల్లించి పత్రాన్ని అప్ డేట్ చేయాలి.
Advertisement
Also Read : భోళాశంకర్ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవే..!