Home » భోళాశంకర్ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవే..!

భోళాశంకర్ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవే..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో హిట్ సాధించి మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన వేదాలమ్ చిత్రానికి రీమేక్ గా వస్తుంది. అజిత్ హీరోగా చేసిన ఈ చిత్రం ఆయనకు చాలా మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి.  

Also Read :  మోహ‌న్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య బాక్సాఫీస్ యుద్దం…ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచారంటే..?

Advertisement

చిరంజీవి ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే చాలా విమర్శలు వస్తున్నాయి. వేదాలమ్ సినిమాని ఇప్పటి దాదాపు అందరూ చూశారు. మళ్లీ రీమేక్ ఎందుకు చేస్తున్నారంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనికి తోడు మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ దర్శకుడికి ఈ చిత్రం దర్శకుడు చేసే అవకాశం ఇవ్వడం చాలా విమర్శలకు నిలయంగా మారింది. దానికి తోడు చిరంజీవి ఫస్ట్ లుక్ కూడా కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీనికి తోడు మెహర్ రమేష్ ముందు సినిమాలు అయినా కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి వరుస ఫ్లాప్ సినిమాలను కలిపి ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

Advertisement

Also Read :  ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసిన హీరో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి సక్సెస్ సాధించిన చిరంజీవి ఈ చిత్రంతో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. ఈ సినిమా తరువాత చిరంజీవి చేయాల్సిన నెక్ట్స్ సినిమా ఏమిటనేది ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి కోసం చాలా రోజులు వెయిట్ చేసిన వెంకీ కుడుముల కూడా నితిన్ తో సినిమా అనౌన్స్ చేశారు. చిరంజీవి తన తరువాత సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయం పై కూడా ఫిలింనగర్ లో విపరీతమైన చర్చలు కొనసాగుతున్నాయి. భోళా శంకర్ రిజల్ట్ చూసి తన నెక్ట్స్ సినిమాని అనౌన్స్ చేసే ప్లాన్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read :   బాహుబలి రేంజ్ లో ‘సూర్య 42’.. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

Visitors Are Also Reading