Home » ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసిన హీరో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసిన హీరో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్, విడాకులు ఇవన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి. ఓ సినిమాతో పరిచయమైన హీరో, హీరోయిన్లు కొన్నేండ్లకు ప్రేమలో పడినట్టు చెప్పడం.. పెళ్లి వరకు వెళ్లడం ఆ తరువాత విబేధాలు వచ్చాయి అని విడిపోవడం వంటివి చోటు చేసుకున్నాయి. అఖిల్, విశాల్, త్రిష, మెహ్రీన్, రష్మిక వీరందరూ ఎంతో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకొని ఆ తరువాత పెళ్లి క్యాన్సిల్ చెప్పి షాక్ ఇచ్చారు.  

Also Read :  బాహుబలి రేంజ్ లో ‘సూర్య 42’.. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయాడు. బాలీవుడ్ లో హీరో విద్యుత్ జమ్వాల్.. ఈ కుర్ర హీరో తెలుగువారికి కూడా సుపరిచితమే. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, సూర్య నటించిన సికిందర్ సినిమాలలో మంచి పాత్రలు చేసి మెప్పించాడు. బాలీవుడ్ లో కమాండో, ఖుదా హఫీజ్, జంగ్లీ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాలను అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా నందితా మహ్తాని అనే ఫ్యాషన్ డిజైనర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు జమ్వాల్. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలెసుకొని బీచ్ లు, రెస్టారెంట్లు అంటూ తిరిగారు. 

Advertisement

Also Read :  ఆయ‌న మ‌గ‌త‌నంతో నాకేం సంబంధం…వైర‌ల్ అవుతున్న సురేఖ‌వాణి వీడియో..!

Manam News

గత ఏడాది ఈ జంట ప్రేమకు సింబల్ అయిన తాజ్ మహల్ వద్ద నిలబడి తమ ప్రేమను వ్యక్తపరిచాడు. తాము ప్రేమలో ఉన్నట్టు అభిమానులతో పంచుకున్నారు. ఆ తరువాత జనతా నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొద్ది రోజుల్లోనే పెళ్లి ఉంటుందనుకునే లోపు వీరు బ్రేకప్ కోట్స్ పెడుతూ ఇన్ స్టా గ్రామ్ హీట్ ఎక్కిస్తున్నారు. మరోవైపు అనన్యపాండే కజిన్ పెళ్లిలో కూడా ఎడమొహం, పెడమొహంగా కనిపించడంతో వీరి ఎంగేజ్ మెంట్ బ్రేక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త విన్న నెటిజన్లు బ్రేకప్ లు, ప్యాచప్ మీకు అలవాటే కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read :  ప్రయాణికులకు శుభవార్త.. TSRTC మరో కీలక నిర్ణయం 

Visitors Are Also Reading