Home » ఆయ‌న మ‌గ‌త‌నంతో నాకేం సంబంధం…వైర‌ల్ అవుతున్న సురేఖ‌వాణి వీడియో..!

ఆయ‌న మ‌గ‌త‌నంతో నాకేం సంబంధం…వైర‌ల్ అవుతున్న సురేఖ‌వాణి వీడియో..!

by AJAY
Ad

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న న‌టీమ‌ణులలో సురేఖ‌వాణి ఒక‌రు. అక్క‌గా వ‌దిన‌గా అనేక చిత్రాల‌లో న‌టించి సురేఖ‌వాణి అభిమానుల‌ను సంపాదించుకుంది. కేవ‌లం ఎమోష‌న‌ల్ పాత్ర‌ల‌లోనే కాకుండా బ్రహ్మానందంకు భార్య‌గా న‌టించి కామెడీని సైతం పండించింది. ఇక సురేఖ‌వాణి సినిమాల‌లోనే కాకుండా సోష‌ల్ మీడియా ద్వారా కూడా ల‌క్ష‌ల్లో అభిమానుల‌ను సంపాదించుకుంది.

ALSO READ : ప్రయాణికులకు శుభవార్త.. TSRTC మరో కీలక నిర్ణయం 

Advertisement

సోస‌ల్ మీడియాలో త‌న ఫోటోలు మ‌రియు వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ‌గా షూటింగ్ స్పాట్ ల‌లో ట్రెండింగ్ వీడియోల‌కు సురేఖ‌వాణి రీల్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఈ నేప‌థ్యంలోనే సురేఖ‌వాణి చేసిన ఓ రీల్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోలో సురేఖ‌వాణి రాజ‌కీయ‌నాయకురాలు ష‌ర్మిల ఓ మీడియా స‌మావేశంలో చెప్పిన డైలాగును చెప్పింది. ష‌ర్మిల ఓ మీడియా సమావేశంలో…నేను అన‌లేద‌య్యా నీ ద‌గ్గ‌ర వీడియో ఉంటే చూపించు చూపించు..నేనెందుకు అంటాను. నాకు ఆయ‌న మ‌గ‌త‌నంతో సంబంధ‌మేంద‌య్యా..నేనెందుకు అనాలి నేనెందుకు మాట్లాడాలి ఆయ‌న…ఆయ‌న భార్య చూసుకోవాలి క‌దా అంటూ చెప్పిన డైలాగును సురేఖ‌వాణి త‌న స్టైల్ లో చెప్పారు.

కాగా సురేఖ‌వాణి చేసిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్ లు సూప‌ర్ మేడం అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అచ్చం ష‌ర్మిల లానే క‌నిపిస్తున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక గ‌తంలోనూ సురేఖ‌వాణి ఇలాంటి వీడియోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ALSO READ : IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

Visitors Are Also Reading