Home » వేసవికాలంలో ఈత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

వేసవికాలంలో ఈత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రకృతిలో లభించే ఏ పండ్లు అయినా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా ప్రకృతిలో ప్రసాధించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా మనకు ప్రకృతిలో లభిస్తాయి. వేసవికాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వేసవిలో ఈతపండ్లు విరివిగా లభిస్తుంటాయి. పల్లెటూర్లలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అంరదూ చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా పిలుస్తారు. పచ్చివి అయితే కాస్త వగరుగా ఉంటే.. బాగా పండినవి అయితే చాలా తియ్యగా ఉంటాయి. 

Advertisement

ఈత కాయలు తొలుత ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఆ తరువాత పసుపు పచ్చ రంగులోకి మారి.. ఆ తరువాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల చాలా బాగుంటుంది. ఈతపండ్లలో సమృద్దిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్ లో లభించే ఈతపండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

Advertisement

ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్ గా ఉదయం వేళలో తింటే జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది.  దీంతో రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవిలో దొరికే ఈ పండ్లను తింటే వేడి తగ్గుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఈత పండ్లు ఎంతగానో సహాయపడుతాయి. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈత పండ్లను తినండి ఆరోగ్యంగా ఉండండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 కలబంద మొక్క ఇంట్లో ఆ దిక్కున ఉంటే ధనవంతులు అవ్వడం పక్కా..!

ఎండాకాలంలో బీరు తాగుతున్నారా ? బీరు వల్ల లాభాలు ఎన్నో..!

జీలకర్రని ఇలా తీసుకుంటే మీరు బరువు తగ్గడం పక్కా..!

 

Visitors Are Also Reading