Home » కమెడియన్ సత్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?

కమెడియన్ సత్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?

by Bunty
Ad

సినిమాల్లో కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. వారు చేసే నటనకి ప్రేక్షకుల్లో నవ్వు రావాలి. దానికోసం వారు చాలా కష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే చాలా ఫేమస్ అవుతారు. అందులో కమెడియన్ సత్య కూడా ఒకరు. అతని నటనకు, కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

Advertisement

“పిల్ల జమిందార్” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సత్య ఆ సినిమా అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన “రంగబలి” సినిమాలో సత్య కామెడీని చాలా అద్భుతంగా పండించాడు. “రంగబలి” సినిమా ప్రమోషన్లలో భాగంగా… అతను చేసే ఇంటర్వ్యూలలో యాంకర్స్ ని ఇమిటేట్ చేస్తూ అతను చేసిన ఇంటర్వ్యూలు చాలా వైరల్ గా మారాయి.

Advertisement

సినిమాల్లో రాణిస్తున్న సత్య ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ… అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం చూసేవాడట. అలాంటి సమయంలో ధనరాజ్…సత్యను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అప్పటికే సినిమాల్లో రానిస్తూ, జబర్దస్త్ లో టీం లీడర్ గా చేస్తున్న ధనరాజ్ సత్యను తన స్కిట్ లో పరిచయం చేశాడు. అలా సత్య జబర్దస్త్ లో చాలా స్కిట్స్ లో నటించి పాపులర్ అయ్యాడు. ఆ సమయంలోనే సినిమా ఆఫర్లను కూడా అందుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు సత్య.

ఇవి కూడా చదవండి

ఈ మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది..!

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

 

Visitors Are Also Reading