Home » దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుసా ?

దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.


‘జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది అందరం నిశితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించారు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆ తరం తర్వాత మళ్లీ జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని కలవాలో, ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలే కనిపించడంలేదు. రాను రాను.. ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమో. ఫుల్ టైమ్ రాజకీయ నేతలు లేకపోవడమో.. పార్టమ్ పాలిటిక్స్, పుల్టైమ్ బిజినెస్ చేసే వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల జరుగుతుందో తెలియదు.

Advertisement

Advertisement

 

ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన గుర్తింపునకు, దేశ రాజకీయాల్లో తెలుగు భాషకు. ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. ఈ పరిణామాలను మేదావులు ప్రస్తావించాలి. మళ్లీ తెలుగువారంతా కలిసి రాణించాల్సిన అవసరముంది. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న 5 బిలియన్ ఎకానమీలో తెలుగువారి పాత్ర ఎలా ఉండాలి. దేశ రాజకీయాల్లో మన నిర్ణయం, ప్రభావం ఉండాలి. దేశంలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు.. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే ప్రభావం చూపించాలి. అధికార నిర్ణయాల్లో మనం భాగస్వాములుగా ఉండాలి.  పీవీ నరసింహారావు ప్రధానిగా పోటీ చేస్తున్నాడని తెలిసి.. అప్పట్లో ఎన్టీఆర్ నంద్యాలలో పోటీకి కూడా పెట్టలేదన్నారు.  రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగు వారిగా అందరం కలిసి ఉందాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read :  ఎన్టీఆర్ దిన చర్య గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading