Home » ఎన్టీఆర్ దిన చర్య గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా..!

ఎన్టీఆర్ దిన చర్య గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

మద్రాస్ మహానగరం  త్యాగరాయనగర్ బజుల్లా రోడ్డులో ఉన్న లక్ష్మీనిలయం నటరత్న ఎన్టీఆర్ ఇల్లు అది. బ్రహ్మ ముహూర్తంలో ఆ ఇంట్లో సందడి మొదలవుతుంది. ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేచి ఆరుబయటికీ వచ్చేవారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకొని కాసేపు అటు ఇటు తిరిగేవారు. నిద్ర లేచిన తరువాత ఎక్సర్ సైజ్ లు చేయడం ఎన్టీఆర్ దినచర్యలో భాగం. సరిగ్గా 3.30 గంటలకు వాహ్నవి స్టూడియో నుంచి మసాజ్ చేసేందుకు ఓ వ్యక్తి వస్తాడు. విజయ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డికి కూడా ఆ వ్యక్తే మసాజ్ చేస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే నాగిరెడ్డికి అత్యంత ఆంత్యరంగికుడు. మసాజ్ చేసే వ్యక్తి వచ్చే సరికి సిద్ధంగా ఉండే వారు ఎన్టీఆర్.

ntr-and-anr-photos

Advertisement

ఒంటినిండా ఆయిల్ పట్టించి.. మసాజ్ చేసేవాడు. దాదాపు అరగంట సేపు మసాజ్ చేసేవాడు. ఆ తరువాత కొద్ది సేపు ఒళ్లు ఆరబెట్టుకొని స్నానానికి వెళ్లేవారు ఎన్టీఆర్. స్నానం, పూజా కార్యక్రమాలను ముగించుకొని తెల్లని పంచె ధరించి ఆఫీస్ రూమ్ లో కూర్చునేవారు. తన బ్యానర్ పై తీయబోయే చిత్రాల లిస్ట్ ని చూడటం.. రచయితలకు అవసరమైన మార్పులు చేయడం.. కథ చర్చలు జరిగేవి. సరిగ్గా 5 గంటలకు భోజనం చేసేవారు. 5 నిమిషాల్లో భోజనం చేసి మేకప్ వేసుకునేందుకు సిద్దమయ్యారు. సోసల్ పిక్ఛర్ అయితే మేకప్ తొందరగా పూర్తి అయ్యేది. పౌరాణికం అయితే కాస్త సమయం పట్టేది. 5.30 కి డ్రెస్ వేసుకొని హాల్ లో కూర్చునేవారు. అప్పటి నుంచి నిర్మాతల రాక మొదలయ్యేది. ఉదయం 6గంటల నుంచే బజుల్లా రోడ్డు టూరిస్ట్ ప్లేస్ గా సందడిగా ఉండేది. తిరుపతి నుంచి మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇంటి వద్దకు చేరుకునే వారు టూరిస్ట్ లు.  ప్రతిరోజు ఉదయం 7 గంటలకు టూరిస్ట్ లను కలిసేవారు. కనీసం 5 బస్సులు వస్తే తప్ప బయటికీ వచ్చే వారు కాదు. 5 నిమిషాల పాటు అందరితో మాట్లాడేవారు. ఏం బ్రదర్.. బాగున్నారా..? సినిమాల గురించి కూడా మాట్లాడేవారు.

Advertisement

సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతుంటే అభిమానులు సంబురపడేవారు. అభిమానులను కలిసిన తరువాత ఎన్టీఆర్ బయటికి వెళ్లగానే గుమ్మడికాయతో దిష్టి తీసేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ కారు ఎక్కేవారు. షూటింగ్ స్పాట్ కి కారు చేరే లోపు చిన్న కునుకు తీసేవారు. హీరోలకు సొంత కుర్చీలు, పర్సనల్ అసిస్టెంట్ అనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కంటే ముందు సెట్ లోకి కుర్చీ వెళ్లేది. దాని మీద టర్కీ టవల్ వేసేవాడు అసిస్టెంట్. ఆ కుర్చీలో క్లాత్ మీద ఎన్టీఆర్ అనే పేరు అందంగా డిజైన్ చేసి ఉండేది. ఆ కుర్చీ సెట్ లోకి వచ్చిందంటే.. ఎన్టీఆర్ వస్తున్నాడని సంకేతం. వెంటనే సెట్ లో ఉన్న వారంతా అలెర్ట్ అయి లేచి నుంచునే వారు. రామారావు రాగానే తొలుత నిర్మాతకి, ఆ తరువాత దర్శకుడికి నమస్కరించి తన పనిలో నిమగ్నమయ్యేవాడు. సరిగ్గా 8 గంటలకు ఫుల్ షాట్ తీసేవారు. 12.55 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. స్టూడియోలో షూటింగ్ అంటే లంచ్ కి ఇంటికి వెళ్లే వారు ఎన్టీఆర్. లంచ్ చేసిన తరువాత అరగంట సేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరేవారు. 2 గంటల వరకు మళ్లీ షూటింగ్ స్పాట్ లో ఉండేవారు. క్రమం తప్పని క్రమశిక్షణ ఆయనది. ఎన్టీఆర్ ని చూసి కొంత మంది వాచ్ ల్లో టైమ్ సెట్ చేసుకునేవారట.

దర్శకుడు చిన్నవాడైనా.. పెద్దవాడైనా సమానంగా చూసేవాడు. దర్శకుడు చెప్పినట్టు చేసేవాడు. తను దర్శకుడు అయినా ఆయన పనిలో వేలు పెట్టేవాడు కాదు. ఏదైనా సూచన చేయాలనిపిస్తే.. దర్శకుడిని పక్కకు తీసుకెళ్లి చెప్పేవారు. సెట్ లో చాలా గంబీరంగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు.. సాయంత్రం షూటింగ్ సందర్భంలో టిఫిన్ తినేవారు ఎన్టీఆర్. ఒకరోజు పకోడీలు, మరో రోజు మిరపకాయ బజ్జీలు, తాపేశ్వరం కాజాలు, సున్నిఉండలు, జున్ను చాలా ఇష్టమట. వాటిని ఎక్కువగా తింటుండేవారు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి 9 గంటలకు నిద్రపోయేవారు. ఇది ఆ రోజుల్లో దిన చర్చ. దాదాపు 30 ఏళ్లు క్రమం తప్పకుండా ఇదే దినచర్యను పాటించారు ఎన్టీఆర్.

 Also Read :  ఇళ్లు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

Visitors Are Also Reading