Home » మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా హీరోయిన్ గా నటించారనే విషయం మీకు తెలుసా ?

మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా హీరోయిన్ గా నటించారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగాస్టార్ చిరంజీవి ఓ సామ్రాజ్యాన్నే స్థాపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి కొనసాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా మంది మంచి సక్సెస్ సాధించారు. మగా ఆడపడచులు మాత్రం ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ సాధించలేకపోయారనే చెప్పాలి.

 

నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. ఈమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి నిర్మాతగా స్థిరపడ్డారు నిహారిక. ఓవైపు నిహారిక మూవీస్ ని నిర్మిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో పని చేస్తున్న విషయం విధితమే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ఆ తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు. 

ప్రస్తుతం ఈమె కూడా సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నారు. చాలా మందికి తెలియని విషయమేంటంటే..? సుస్మిత కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారని తెలుస్తోంది. సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న ప్రతీసారి ఏదో ఓ ఆటంకం ఎదురుకావడంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించుకున్నారట. ఈ మె హీరోయిన్ గా ఓ సినిమాలో మాత్రం నటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో విడుదల కాలేదట. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సుష్మిత-ఉదయ్ కిరణ్ జంటగా ఓ సినిమాలో నటించారట. ఫస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఈ మూవీ సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా విడుదలై ఉంటే.. సుస్మిత లైఫ్ మరో విధంగా ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ మళ్లీ ఆ పాత్రలోనా..?

శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 విడుదలయ్యేది అప్పుడే..?

Visitors Are Also Reading