Home » బిగ్‌బాస్ 6 సీజన్ లో గీతూకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బిగ్‌బాస్ 6 సీజన్ లో గీతూకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

బిగ్ బాస్ 6 సీజన్ లో అతి ఎక్కువగా మారుమ్రోగుతున్న పేరు గీతూ రాయల్. బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం నుంచి హౌజ్ లో అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆమె అనూహ్యంగా ఎలిమినేషన్ అవ్వడంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హౌజ్ మేట్స్ కూడా గీతూ ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ హౌజ్ ని వీడే ముందు గీతూ నన్ను పంపించొద్దు బిగ్ బాస్ అంటూ వేడుకున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టంగానే ఆమె హౌజ్ ను వీడిపోయింది. సోషల్ మీడియాలో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ పాపులర్ అయింది గీతూ.

Also Read : చిరంజీవి గదిలో బాలకృష్ణ నెటిజన్లను ఆకట్టుకున్న ఫోటో..!

Advertisement

Manam

సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన గీతూ తనదైన ఆటతీరుతో దాదాపు 9 వారాలు ఎంటర్ టైన్ చేసింది. ఈ నేపథ్యంలో గీతూ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఆమె పారితోషికం ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గీతూ రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారానికి రూ.25 వేల చొప్పున పారితోషికం అందిందని తెలుస్తోంది. అలా అయితే 9 వారాలకు 2.5 లక్షల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అయితే అందరి కంటే బాగా ఆడిన గీతూకి ఇంత తక్కువ పారితోషికం ఏంటని ఆమె ఫాలోవర్స్ అభిప్రాయ పడుతున్నారు. హౌజ్ లో రేవంత్, బాలాదిత్య, నేహా చౌదరి, శ్రీ సత్య, కీర్తి, వాసంతి, వినయ సుల్తానా, రోహిత్, మెరీనా, సూర్యల కంటే గీతూ రెమ్యూనరేషన్ తక్కువనే అనే చర్చ కూడా కొనసాగుతుంది.

Advertisement

Also Read : ఈ వ్యాధులు ఉన్న వారు వేరు శనగను అస్సలు తినకూడదు.. తింటే అంతే..!

Manam

గీతూకి కోపం కాస్త ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లో ఆమె వ్యవహరించేది. అంతేకాదు టాస్క్ లో తన బుద్ధి బలంతో పాటు తన అతి తెలివి వాడి రూల్స్ నే మార్చేది. ఇలా ఒకసారి బిగ్ బాస్ హూస్ట్ నాగార్జున చేతిలో చివాట్లు కూడా తింది. ఇక ఆమె అతివల్లే గీతూకి నెగిటివిటీ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. పనుల విషయంలో బద్దకంగా చూపించడం, తనకు కేటాయించిన పనిని చేయకుండా, పక్కవారితో చేయించేది గీతూ. ఏం చెప్పినా తనకు ఓసీడీ అంటూ సింపుల్ గా తప్పించుకునేది. శ్రీహన్ కెప్టెన్సీలో గీతూ చేసిన తప్పిదం వల్లే అతడు ఈ వారం కంటెండర్ గా అనర్హుడు అయ్యాడు. ఇక ఇది పక్కన పెడితే శ్రీహన్ గీతూతో సింగిల్ గా వాష్ రూమ్ క్లీనింగ్ చేపిస్తానంటూ హోస్ట్ కు మాటిచ్చాడు. కనీసం అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా గీతూ తన పని చేయకుండా ఆదిరెడ్డి తో చేయించింది. దీంతో శ్రీహాన్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అనర్హుడయ్యాడు. అతని ఫ్యాన్స్ నుంచి కూడా గీతూకి వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి అలా గీతూ బిగ్ బాస్ లోంచి బయటికి వచ్చేసిందట.

Also Read :  తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిసి నటుడు ఆలీ .. ఎందుకో తెలుసా ?

 

Visitors Are Also Reading