Home » చిరంజీవి గదిలో బాలకృష్ణ నెటిజన్లను ఆకట్టుకున్న ఫోటో..!

చిరంజీవి గదిలో బాలకృష్ణ నెటిజన్లను ఆకట్టుకున్న ఫోటో..!

by Anji
Ad

సాధారణంగా సెలబ్రిటీలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే అవి వైరల్ అవుతుంటాయి. అలాంటిది పాత ఫోటోలయితే ఇక చెప్పాల్సిన అవరమే లేదు.  వాటికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంటుంది. చిరంజీవితో బాలయ్య ముచ్చటిస్తున్న త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో నేటిజన్లని  ఎంతగానో ఆకర్షించింది. దానికి ఒక కారణం ఉంది. ఆ పాత ఫోటోలో చిరంజీవి  పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్నారు.  పూలతో అలంకరించిన పందిరి మంచం పై కూర్చుని బాలకృష్ణ, చిరంజీవి మాట్లాడుకుంటున్నారు. దీంతో చిరంజీవి శోభనం గదిలో బాలయ్య ఏం చేస్తున్నారు?  ఈ ఫోటో నేపథ్యం ఏమిటనే  ఆసక్తి  నెటిజన్లలో  పెరిగింది.

Advertisement

ఇక ఆ ఫోటోని పరిశీలించినట్టయితే  ఘరానా మొగుడు మూవీలోని శోభనం సీన్ సెటప్ అది. దర్శకుడు కే. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ చిత్ర ఓపెనింగ్ కి అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఫస్ట్ రోజే రాఘవేంద్రరావు చిరంజీవి, నగ్మా మధ్య శోభనం సీన్ తీయాలని ఆ సెటప్ వేయించాడు. ఘరానా మొగుడు సినిమా సెట్స్ కి వచ్చిన బాలకృష్ణ శోభనం పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న చిరంజీవితో ఆ గదిలో కూర్చుని మాట్లాడారు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటో అది.

Advertisement

Also Read :  అడివి శేష్ హిట్ 2 టీజర్ పై యూట్యూబ్ కాంట్రవర్సీ.. అసలు ఏం జరిగింది ?

బాలకృష్ణది లక్కీ హ్యాండ్ అనే సెంటిమెంట్ సినీ పరిశ్రమలో ఉంది. అప్పట్లో చాలా సినిమాలకు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టేవాడు. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్ర లాంచింగ్ ఈవెంట్ కి హాజరై పవన్ పై క్లాప్ కొట్టారు బాలకృష్ణ. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ హిట్ సుస్వాగతం కావడం విశేషం. ఘరానా మొగుడు సైతం భారీ విజయాన్ని సాధించింది. 1992లో విడుదలైన ఘరానా మొగుడు తెలుగు ప్రేక్షకులను ఊపేసింది. చిరంజీవి మాస్ మేనరిజమ్స్, కీరవాణి సాంగ్స్ సినిమాకు హైలెట్. అదే ఏడాది బాలకృష్ణ నుంచి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ధర్మక్షేత్రం, రౌడీ ఇన్ స్పెక్టర్, అశ్వమేధం చిత్రాల్లో రౌడీ ఇన్ స్పెక్టర్  మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన రౌడీ ఇన్ స్పెక్టర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపింది. 1992లో చిరంజీవికి ఘరానా మొగుడు, బాలకృష్ణకు రౌడీ ఇన్ స్పెక్టర్ రూపంలో మంచి విజయాలు దక్కాయి.

Also Read :  ఆ త‌ప్పుచేసినందుకు ఉద‌య్ కిర‌ణ్ నా కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్నాడు…తేజ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

Visitors Are Also Reading