Home » కీర్తి సురేష్ కి మృణాల్ ఠాకూర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

కీర్తి సురేష్ కి మృణాల్ ఠాకూర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

by Anji
Ad

‘మహానటి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ మలయాల ముద్దగుమ్మ ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా తర్వాత తన గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. కీర్తి సురేష్ అందాలు చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఇక ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన వాటితో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి నటిస్తున్న బోలాశంకర్ సినిమాలో ఆయనకు చెల్లి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్.

Also Read : కృష్ణంరాజుకు ఆ ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.. నాన్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రసీద..!!

Advertisement

మృణాల్ ఠాకూర్ కూడా గుర్తింపులో తక్కువ ఏమీ కాదు.. ఇక ఈమె గురించి తెలుసుకోవాలి అంటే సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన మృణాల్.. సోనియా అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్న మృణాల్ ఇటీవల విడుదలైన సీతారామన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. యుద్ధంతో సాగే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యమిది. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్.. స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీ దత్, స్వప్న దత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఒకవైపు ప్రిన్సెస్ నూర్జహాన్.. మరొకవైపు సీతామహాలక్ష్మి గా మృణాల్ తనదైన నటనతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసింది.

Advertisement

Also Read : ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గీతాసింగ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే…?

ఇలా ఉండగా ఎవరికి తెలియని విషయం ఏమిటంటే మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ కు సీతామహాలక్ష్మిగా అలరించిన మృణాల్ ఠాగూర్ కు మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉందట. ఇక అదేమిటంటే సీతారామంలో సీతాలక్ష్మి గా మృణాల్ నటించడానికి ఒకరకంగా కీర్తి సురేష్ కారణమట. స్వయంగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అసలు విషయంలోకి వెళ్తే.. మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ కు మహానటి సినిమా తరఫున డైరెక్టర్ నాగ అశ్విన్ వచ్చారు. ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతం. ఆమె నటన చూశాక అలాంటి అందమైన పాత్ర చేయాలని ఉందంటు నాగ అశ్విన్ తో నా మనసులో మాటను బయటపెట్టాను. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్నాయన సీతారామం సినిమాలో నాకు అవకాశాన్ని కల్పించారు. అలా సీతారామం ద్వారా వైజయంతి ఫిలిమ్స్ లో నేను భాగమయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న నాని..!

 

Visitors Are Also Reading