Home » ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గీతాసింగ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే…?

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గీతాసింగ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే…?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ చాలామంది ఉంటారు. కానీ లేడీ కమెడియన్స్ ని మాత్రం వేళ్ళ పైనే లెక్క పెట్టవచ్చు. లేడీ కమెడియన్ లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కూడా అతి తక్కువ మంది ఉంటారు. ఆ లిస్టులో టాలీవుడ్ లో గీతా సింగ్ కూడా ఒకరు. గీతా సింగ్ టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Also Read: అమాయకంగా కనిపించే ఈ పిల్లలు ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలు..గుర్తుపట్టండి..!!

Advertisement

అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి గీతా సింగ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాలో నరేష్ కు భార్యగా నటించి నవ్వులు పూయించారు. సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించిన గీతా సింగ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా గీతా సింగ్ అసలు స్క్రీన్ పై కనిపించడం లేదు. కాగా తాజాగా ఇంటర్వ్యూలో గీతా సింగ్ దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Also Read:  భార్య భర్తలు భయం లేకుండా ఈ 1 పని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..!!

Advertisement

సినిమాల్లో తనకు అవకాశాలు రావడంలేదని అందుకే నటించడం లేదని గీతా సింగ్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో అసలు తనకు సపోర్ట్ లేదని… అంతేకాకుండా ఇప్పుడు అసలు ఫిమేల్ ఆర్టిస్టులు కనిపించడం లేదని చెప్పారు. అందరూ మేల్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకున్నారు. నా అనుకున్న వాళ్ళే తనను దారుణంగా మోసం చేశారని చెప్పారు. డబ్బు అవసరం ఉంటేనే తన కుటుంబానికి కూడా తాను గుర్తుకు వస్తానని చెప్పారు. తన సొంత చెల్లెలు సైతం తనను దారుణంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తనను దారుణంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెను నమ్మి 6 కోట్ల వరకు చిట్టీలు వేశారని అయితే ఆ తర్వాత మోసం చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. కానీ తన స్నేహితురాలు తనను కాపాడిందని….. ఇప్పటికీ ఆమెనే తన మంచి చెడులు చూసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వాళ్లతోనే జీవిస్తున్నానని గీతా సింగ్ వెల్లడించారు.

Also Read: 1962 ANR-NTR మధ్య 3 సార్లు పోటీ.. గెలుపెవరిదంటే..!!

Visitors Are Also Reading