Home » శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎంట్రీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎంట్రీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

బుల్లితెర మీద జబర్దస్త్ షో తో బాగా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. ఈయన కమెడీయన్ గా ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరోవైపు సుధీర్, రష్మీ ప్రేమించుకుంటున్నారు అనే విషయంలో కూడా చాలా ఫేమసయ్యాడు. జబర్దస్త్ షో ద్వారా వీరి కెమిస్ట్రీ ఎంతో పాపులర్ అయింది. సుధీర్, రష్మి ప్రేమలో ఉన్నట్టు వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు దాదాపు పదేళ్లుగా ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా తమ అనుబంధం చాలా స్పెషల్ అని చెబుతూనే ప్రేమ, పెళ్లి వార్తలను సుధీర్, రష్మి ఖండిస్తూ వస్తున్నారు.  

Also Read :  Dasara : వివాదంలో చిక్కుకున్న నాని దసరా మూవీ… ఆపేస్తామని వార్నింగ్!

Advertisement

ఇటీవల సుధీర్ జబర్దస్త్ ప్రచారమయ్యే ఛానెల్ కి దూరం అవ్వడంతో సుధీర్, రష్మీ ని జంటగా చూసే ఛాన్స్ వారి ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది వంటి వారు గుర్తుకొచ్చేవాళ్లు. వీరిలో కొందరూ జబర్దస్త్ కామెడీ షో నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం కొత్త ఆర్టిస్టులతోనే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు నడుస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసినప్పుడు ఓ రేంజ్ లో ఉండేది. ప్రస్తుతం కొంతడల్ గానే కొనసాగుతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ లలో ఈ షో కింద సుధీర్ ని తీసుకురండి. సుధీర్ అన్న రావాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవి ఆలోచించి చేశారో లేక రేటింగ్ పడిపోతుందనుకున్నారో ఏంటో కానీ చివరికి సుడిగాలి సుధీర్ ను మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకొచ్చారు. తాజాగా ఎపిసోడ్ ని ఇంద్రజ హోస్ట్ చేశారు. 

Advertisement

Also Read :  Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

Rashmi Gautam talks about Sudigali Sudheer marriage proposal & breakup

శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు వారి జీవితంలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులను ఈ స్టేజీ మీదకు పిలిచి థాంక్స్ చెప్పబోతున్నారని ఇంద్రజ అనడంతో దర్శకుడు తేజ, ఆర్పీ పట్నాయక్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాం ప్రసాద్, హైపర్ ఆది, ఇమ్మాన్యూయేల్ మానస్, వర్ష, రష్మి ఇలా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు.  ప్రధానంగా సుధీర్ ని తిరిగి ఈ షోలో చూడడంపై ఆడియన్స్  చాలా  సంతోషంగా ఉన్నారు. సుధీర్ అన్నను తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్, సుధీర్ ఈజ్ బ్యాక్.. టీఆర్ఫీ రేటింగ్ బ్రేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిని బట్టి చూస్తే.. సుధీర్ క్రేజ్ ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సుధీర్ కి హీరోగా సినిమాలలో అవకాశాలు వస్తుండడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేశాడు.  జబర్దస్త్ మానేసిన తరువాత మరో ఛానల్ లో ఓ షో చేశాడు. ప్రముఖ ఓటీటీలో ఓ షోను చేశారు. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎందుకు మానేశారనే ప్రశ్నకు సుధీర్ చాలా సార్లు సమాధానం చెప్పాడు. వాళ్లు ఎప్పుడూ పిలిచినా రావడానికి తాను రెడీ అంటూ చెప్పాడు. సుధీర్ రష్మీతో చేయానికే వచ్చి ఉంటాడనే కామెంట్స్ వినిపించడం విశేషం. 

Also Read :  టాలీవుడ్ మరో విషాదం..సీనియ‌ర్ న‌టుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ క‌న్నుమూత‌

Visitors Are Also Reading