చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ దిగ్గజనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొందరు మరణిస్తే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఆదివారం ఉదయం చెన్నైలోనే తన స్వగృహంలో తుది శ్వాస వదిలారు.
READ ALSO : జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!
కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతోపాటు అందులో నటించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు.
Advertisement
read also : 1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
సినీ రంగంలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలను నిర్మించడంతో పాటు పలు చిత్రాలలో విలన్ గా, సహాయక నటుడిగా పాత్రలు పోషించారు. పెళ్ళాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
read also : అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!