Home » సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా..? 

సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా..? 

by Anji
Ad

భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తరువాత వీడ్కోలు పలుకనుంది సానియా మీర్జా. ఈ రెండు టోర్నీలు తనకు చివరివి అని, మూడు పేజీల నోట్ ని ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.  ఇందులో తన సుదీర్ఘ ప్రయాణం, అనుభావాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.  

Advertisement

ముఖ్యంగా హైదరాబాద్ లో తన తల్లితో కలిసి 30 ఏళ్ల కిందట తొలిసారి నిజాం క్లబ్ లో టెన్నిస్ కోర్టుకు వెళ్లానని.. అక్కడ కోచ్ టెన్నీస్ ఎలా ఆడాలో వివరించినట్టు గుర్తు చేసింది. ముఖ్యంగా ఆరేళ్ల వయస్సులోనే నా కలను సాకారం చేసుకునేందుకు పోరాటం ప్రారంభం అయిందని తెలిపారు. ఇక అన్ని సమయాలలో కుటుంబం, తల్లిదండ్రులు, కోచ్, ఫిజియో, టీమ్ మొత్తం మద్దతు ఇది సాధ్యమయ్యేది కాదు అని పేర్కొంది సానియా. ప్రతీ ఒక్కరితో బాధ, కన్నీళ్లు, పంచుకున్నట్టు పేర్కొంది. అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ కి చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా.. ఆ కలలను సాధించడంలో సాయం చేశారంటూ ధన్యవాదాలు ప్రకటించింది.  

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా

Manam News

సానియా తన కెరీర్ లో 36వ ఏటా ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మహిళల డబుల్స్ లో కజకిస్తాన్ కి చెందిన అనాడాలినాతో కలిసి గ్రాండ్ స్లామ్ లో ఆడనున్నది.మో చేతికి గాయం కారణంగా గత ఏడాది యూఎస్ ఓపెన్ కి దూరం అయింది. ఈ మధ్యకాలంలో ఫిట్ నెస్ సమస్యలు ఇబ్బంది పెట్టాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలగడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. సానియా తన కెరీర్ లోనే 6 గ్రాండ్ స్లామ్ లను సాదించింది. ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది. అంతకు ముందు సింగిల్స్ లో మాత్రమే సత్తా చాటింది సానియా మీర్జా. ప్రపంచ ర్యాకింగ్స్ లో 27వ స్థానానికి చేరుకుంది. 2005 యూఎస్ ఓపెన్స్ లో నాలుగో రౌండ్ కి చేరింది. 

Also Read :  శీతాకాలంలో వాకింగ్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తప్పనిసరి..!

Visitors Are Also Reading