Home » బిగ్‌బాస్‌లో గీతూ ఎలిమినేష‌న్ వెనుక అస‌లు కార‌ణం ఏంటో తెలుసా ?

బిగ్‌బాస్‌లో గీతూ ఎలిమినేష‌న్ వెనుక అస‌లు కార‌ణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

జబర్దస్త్ గీతూ రాయల్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి గీతూ.. అదే క్రేజ్ తో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చిత్తూరు యాసతో జబర్దస్త్ షో త‌న‌దైన కామెడీతో అదరగొట్టి ప్రేక్షకులకు చేరువ అయింది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా గీతు ఇన్ని రోజులపాటు అలరించి ఇటీవల ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న రసవత్తరమైన పోటీ నుంచి గీతూ.. అక‌స్మాత్తుగా ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

Also Read : వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ పై తప్పుడు ప్రచారం..!

Advertisement

Manam

ఇక బిగ్ బాస్ నుంచి గీతూ వెళ్లిపోవడంపై షాక్‌కి గురైన వారికంటే.. హౌజ్ లో పీడ వదిలింది అనుకుంటున్న వారే ఎక్కువగా క‌నిపిస్తున్నారు. బిగ్ బాస్ లో చాలా వారాలు గ‌ట్టి పోటీనిచ్చిన గీతూ చివరి రెండు వారాలలో చేసిన మిస్టేక్స్ వల్లే బయటకు వచ్చేసింద‌ని చాలా మంది అనుకుంటున్నారు. కానీ గీతూ బిగ్ బాస్ నుంచి బయటకి రావడానికి వేరే కారణాలు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. అదేంటంటే బిగ్ బాస్ కి వెళ్ళకముందు జబర్దస్త్ లో కామెడీ పండించిన గీతూ తనదైన యాసతో అందరిని ఆకట్టుకుంది.

Advertisement

Also Read : విలన్ దేవరాజ్ రాజ్ భార్య ఆ అందమైన హీరోయిన్ అన్న సంగతి తెలుసా…?

Manamఈ త‌రుణంలోనే బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అందులోకి వెళ్లిపోవడం అన్ని చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. బిగ్ బాస్ కి వెళ్లడం వరకు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. గీతూ బయటికి వచ్చిన కారణం వేరేనే ఉందరి టాక్ వినిపిస్తోంది. అదేంటంటే బిగ్ బాస్ కంటే ముందు గీతూ జబర్దస్త్ లో పుష్ప స్కిట్స్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ స్కిట్స్ తో చిత్తూరు యాసను బాగా పాపులర్ చేసింది. ఆ స్కిట్ తోనే గీతూకి లేడీస్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఖాలీగా లేకుండా వచ్చే ముందు పుష్ప2 లో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. పుష్ప స్కిట్ వల్ల గీతూ పుష్ప2 లో అవకాశం అందుకుందని గీతూ యాస టాలెంట్ చూసి ఆమెను పుష్ప2 టీమ్ అప్రోచ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్త‌వం ఉందో లేదో తెలియాలంటే పుష్ప చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేంత వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

Also Read :  హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? అనారోగ్యంతో తండ్రి ఇద్దరు అన్నలు అలా..!

 

Visitors Are Also Reading