Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » విశ్వక్ సేన్ అసలు పేరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

విశ్వక్ సేన్ అసలు పేరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. వెరైటీ కథలతో మన ముందుకు వస్తున్న ఈ హీరో ఈ జనరేషన్ కు ఎంతో కనెక్ట్ అవుతున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ తో ముందుకు పోతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నుంచి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కృష్ణ చైతన్య దర్శకత్వంలో సీతారామ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది.

Advertisement

Ad

ఇక ఈయన పేరు చాలా వెరైటీగా ఉండడంతో జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోయింది. కానీ విశ్వక్ సేన్ అసలు పేరు ఇది కాదట.. ఆయన పూర్తి పేరు దినేష్ నాయుడు. అదే పేరుతో ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు. వెళ్ళిపోమాకే అనే సినిమాను చేశారు. కానీ ఆ మూవీ ఎంతకి కూడా రిలీజ్ కాలేదు. రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా వాయిదా పడడంతో జాతకం చూయించుకున్నారు. అయితే నీ పేరు వల్ల అభివృద్ధి చెందవని చెప్పడంతో ఆయన మూడు పేర్లు సూచించారట.

Advertisement

అందులో విశ్వక్ సేన్ పేరు కొత్తగా అనిపించడంతో దానికి ఫిక్స్ అయ్యారు. అయితే బెంగాలీ పేరు పెట్టుకున్నావని చాలామంది అడిగారట. కానీ విశ్వక్ సేన్ ముందు ఏదో పేరు పెట్టుకున్నాను ఒకవేళ సెట్ కాకపోతే చూద్దాం లే అనుకున్నారట. కానీ ఈ పేరు పెట్టుకున్న నెల రోజులకే వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ఆ పేరుకే ఫిక్స్ అయ్యారు విశ్వక్ సేన్. ఈ విధంగా ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు చేస్తూనే మంచి స్టార్ గా ఎదిగారు. రెండు చేతుల సంపాదిస్తున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading