Home » ఎన్టీఆర్ గారికి భారతరత్న సత్కారం ఇవ్వకపోవడానికి గల కారణం ఇదేనా ?..?

ఎన్టీఆర్ గారికి భారతరత్న సత్కారం ఇవ్వకపోవడానికి గల కారణం ఇదేనా ?..?

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు మైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తెలిసేలా చేశాడు. అలా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో తెలిసేలా చేసిన సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కూడా అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు.

sr-ntr-rare-photos

Advertisement

 

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సమయంలో ఎలాంటి విషయాలు జరిగాయి అనే దానిని ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ నరసయ్య గారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా నరసయ్య గారు సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ… ఎన్టీఆర్ గారికి రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేదు. సినిమాల ద్వారా తనను ఎంతగానో ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపన మాత్రం చాలా ఉండేది.

Advertisement

Sr.Ntr

Sr.Ntr

ఆయనను ఎవరైనా మీరు కమ్యూనిస్ట్ హా లేక మరి ఇంకేంటి అని అడుగుతే… ఆయన నేను హ్యూమనిస్ట్ అంటూ సమాధానం ఇచ్చేవాడు. ఆయనకు రాజకీయల గురించి చాలా తక్కువ విషయాలు తెలుసు… లేకపోతే థర్డ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న ఆయనకు ప్రధాన మంత్రి అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంజీఆర్ గారికి భారతరత్న పురస్కారం దక్కింది.

కానీ సీనియర్ ఎన్టీఆర్ గారికి పద్మ శ్రీ అవార్డును తప్పిస్తే వేరే అవార్డులు ఏమి రాలేదు. ఆయన భారతరత్న అవార్డుకు అర్హులు… కానీ ఆయనకు ఆ అవార్డు దక్కడం కోసం ఎవరూ పెద్దగా చొరవ చూపడం లేదు అంటూ నరసయ్య తాజా ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.

Visitors Are Also Reading