Home » ఉదయ్ కిరణ్ లాగే తరుణ్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళారా? ఆలస్యంగా నిజం వెలుగులోకి !

ఉదయ్ కిరణ్ లాగే తరుణ్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళారా? ఆలస్యంగా నిజం వెలుగులోకి !

by AJAY
Ad

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి చిన్నతనంలోనే మంచి నటుడుగా గుర్తుకు తెచ్చుకున్న తరుణ్ ఆ తర్వాత నువ్వే కావాలి మూవీతో ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్కసారిగా తరుణ్ లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది.

Advertisement

అలా మొదటి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తరుణ్ ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటే క్లాస్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ మూవీల విజయాలతో ఈ హీరో రేంజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరింతగా పెరిగిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి అతి తక్కువ కాలంలో చేరుకున్న ఈ నటుడు ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా అపజాయలు సాధిస్తూ రావడంతో ప్రస్తుతం తరుణ్ సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నాడు.

Advertisement

అప్పుడప్పుడు జరుగుతున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన క్రికెట్ పోటీల్లో తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర అంశాల్లో ఈ నటుడు కనబడడం లేదు. దానితో తరుణ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు అంటూ అనేక కథనాలు కూడా బయటికి వస్తున్నాయి. ఇలా ఈ నటుడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్నేహితుడు అయినటువంటి రాజీవ్ కనకాల ఈ విషయంపై తాజాగా స్మందించాడు.

రాజీవ్ కనకాల… తరుణ్ గురించి మాట్లాడుతూ… తరుణ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే ఒక మంచి సబ్జెక్ట్ తో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే కారణంతో అనేక కథలను వింటున్నాడు. త్వరలోనే తరుణ్ ఒక అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు తరుణ్ వస్తాడు అని భావిస్తున్నాను. అలాగే ఆయన వెనకాల చాలా పెద్ద ప్లాన్ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading