Home » జవాన్ చిత్రంలో షారుక్ ఖాన్ కి డూప్ గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఒక్క రోజుకి అతని రెమ్యూనిరేషన్ ఎంతంటే..?

జవాన్ చిత్రంలో షారుక్ ఖాన్ కి డూప్ గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఒక్క రోజుకి అతని రెమ్యూనిరేషన్ ఎంతంటే..?

by Mounika

 బాలీవుడ్ బాద్షా షారఖ్ ఖాన్   జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం  బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది . రెండు రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అయితే ఇందులో తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో షారుక్ మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి డూప్ గా నటించిన వ్యక్తి గురించి ప్రస్తుతం పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అతను ఎవరు? రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలు చూద్దాం.

‘జవాన్’ మాత్రమే కాదు.. గత 15 ఏళ్లుగా షారుక్‌కి డూప్‌గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్డే. షారుక్‌కి డూప్‌గా నటిస్తున్నా ఈ వ్యక్తి రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జవాన్’ విశేషాలను వెల్లడించాడు. జవాన్ సినిమాలో ఒకే రోజు రెండు గెటప్‌లు .. కొడుకు తండ్రిని కౌగిలించుకునే సన్నివేశం అది. షారుక్‌ కొడుకు గెటప్‌ వేస్తే… నేను తండ్రి గెటప్‌ వేసాను అని, నన్ను హగ్ చేసుకుంటూ క్లోజప్ షాట్లు తీశారు. తర్వాత నా కొడుకు గెటప్ వేస్తే… షారుఖ్ తండ్రి గెటప్ సీన్ తీశారు. అంటే మేమిద్దరం ఒకే రోజు రెండు విభిన్నమైన గెటప్‌లు వేయాల్సి వచ్చింది అని ప్రశాంత్  ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

అయితే షారుక్‌కి డూప్‌గా నటిస్తున్న ప్రశాంత్ రూ. రోజుకు 30 నుంచి 40 వేలు పారితోషికంగా ఇచ్చేవారట. అంటే నెలకు దాదాపు రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే మొత్తం సినిమాలో అతనికి సంబంధించిన అన్ని సన్నివేశాలు పూర్తి చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. దీంతో రూ.30-40 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :

ఒకమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. అద్దెకుంటామని ప్లాట్ లోకి.. వారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఎట్టకేలకు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని బయటపెట్టిన అనుష్క..!

జైలర్ సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ?

 

Visitors Are Also Reading