Home » రాజ‌మౌళి కెరీర్‌లో న‌ష్టాలు తెచ్చిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

రాజ‌మౌళి కెరీర్‌లో న‌ష్టాలు తెచ్చిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శక ధీరులు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే ఫెయిల్యూర్ లేకుండా ఇప్పటివరకు సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన వారిలో దర్శక ధీరుడు రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ ఒక్క సినిమా ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

rajamouli 1

Advertisement

స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ వరకు… ఏకంగా 13 సినిమాలు చేసిన రాజమౌళి… అన్ని సినిమాలను హిట్ చేసేలా డైరెక్ట్ చేశాడు. అయితే.. రాజమౌళి కెరీర్ లో ఒకే ఒక్క సినిమా ఆయనకు నిరాశను కలిగించిందట. భారీ నష్టాలను మిగిల్చిన సినిమా కూడా ఇదేనట. నితిన్ హీరోగా రాజమౌళి సై సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే. 2004 సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది.

rajamouli

Advertisement

ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించిన.. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథపరంగా అందరిని ఆకట్టుకుంది. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు తీసుకురాలేదట. 8 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా… లాంగ్ రన్ లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది అట. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు కమర్షియల్ గా చాలా లాస్ వచ్చిందట. కాగా ప్రస్తుతం రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading