Home » సూపర్ స్టార్ కృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారుండరు. కానీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సాధారణంగా ఒక వ్యక్తి సినిమాల్లో నటించాలంటే టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ విషయంపై సూపర్ స్టార్ కృష్ణ ని చూస్తే కచ్చితంగా వాస్తవం అని ఒప్పుకోక తప్పదు. తొలుత ఆయనను ఎవ్వరూ పట్టించుకోలేదు. తేనె మనసులు అనే సినిమాలో కృష్ణతో పాటు రామ్మోహన్ రావు అనే నటుడు నటించాడు. ఈ చిత్రం రెండు జంటలపై నడిచే సినిమా కాబట్టి ఇద్దరికీ వాస్తవానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. 

Manam News

Advertisement

కానీ రామ్మోహన్ రావు చూడటానికి కొంచెం పొట్టిగా, లావుగా ఉంటాడు. అంతేకాదు.. బాలీవుడ్ నటుడు అయినటువంటి దేవానంద్ పోలికలు అతనికి దగ్గరగా కనిపిస్తాయి. అందుకే రామ్మోహన్ రావు బాగా క్లిక్ అయ్యాడు. ఈ చిత్రం తరువాత రామ్మోహన్ రావు కి జంటగా నటించినటువంటి సుకన్య బాగా క్లిక్ అయింది. ఈ చిత్రాన్ని తీసిన ఆదుర్తి సుబ్బారావు కూడా అతడు ఆంధ్ర దేవానంద్ అంటూ ఆకాశానికి ఎత్తి అతనికే ఎక్కువ శాతం సీన్స్ ఉండేవిధంగా చేసాడు. కృష్ణ కి జంటగా సంధ్య అనే ఓ ఆర్టిస్టు నటించింది. కృష్ణని సంధ్య ఇద్దరినీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే.. కృష్ణ ఈ చిత్రానికి సెకండ్ హీరో మాత్రమే. అదేవిధంగా కన్న మనసులు సినిమాలో కూడా కృష్ణ సెకండ్ హీరోగా నటించాడు. హీరోగా ఉన్న కృష్ణ విలన్ గా నటించడానికి ప్రయివేటు మాస్టార్ అనే సినిమా కోసం ఒప్పుకున్నాడు. దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రయివేటు మాస్టార్ సినిమాకి కె.విశ్వనాథ్ దర్శకత్వం అందించారు.  

Advertisement

Also Read :  సీనియర్ నటి వరలక్ష్మి మామూలుది కాదు.. వేల కోట్లకు అధిపతి..!!

Manam News

ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు, కన్నె మనసులు, ప్రయివేటు మాస్టారు వంటి సినిమాలకు రామ్మోహన్ రావు ని బాగా ప్రోత్సహించిన తరువాత తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆంధ్ర దేవానంద్ అనే పేరు మత్తులో పడిపోయి దాని నుంచి బయటికి రాలేక తరువాత హీరో పాత్రలకు మాత్రమే ఒప్పుకోవడంతో మిగతా పాత్రలు కూడా రాకపోవడంతో కనబడకుండా పోయాడు. ప్రయివేటు మాస్టార్ సినిమా ఫ్లాప్ అవ్వడం కృష్ణకి కలిసొచ్చింది. లేదంటే కృష్ణంరాజుల అటు హీరో కాకుండా ఇటు విలన్ కాకుండా మిగిలేవాడు. ఆ తరువాత గూడచారి 116 సినిమా కోసం కృష్ణని ఎంపిక చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో కృష్ణ తిరుగులేని హీరోగా మారిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. 

Also Read :  పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్ అదితి.. డేట్ ఫిక్సయిందా..?

 

Visitors Are Also Reading