Home » రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మూవీ ఏంటో తెలుసా ?

రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మూవీ ఏంటో తెలుసా ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి ఎంత పేరు దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. తన సినీ కెరియర్ లో అసలు ఫ్లాప్ అంటూ చవిచూడని రాజమౌళి ఇండియన్ సినిమా చరిత్రలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరొకసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే రాజమౌళి డైరెక్టర్ గానే చాలామందికి తెలుసు. కానీ, ఆయన నటుడుగా కూడా చేశాడు. అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు.రాజమౌళి పెద్ద డైరెక్టర్ గా తన సినిమాలలో హీరోలకు సీన్లు వివరించేటప్పుడు నటించి చూపిస్తారట.

rajamouli

Advertisement

అది మాత్రమే కాదు రాజమౌళి ఒక సినిమాలో బాల నటుడిగా కూడా వెండితెరపై కనిపించారు అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక పోతే రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో వెల్లడించారు. ఇక రాజమౌళి నటించిన సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి బాల నటుడుగా పిల్లనగ్రోవి అనే సినిమాలో నటించారు. 1983లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అప్పటికీ రాజమౌళి వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. రాజమౌళి బాడ్ లుక్ ఏమిటంటే ఈ సినిమా అప్పుడు విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల చేస్తారా అంటే ఆ ఊసే లేదు.అయితే తాను కూడా బాల నటుడిగా కనిపించానన్న విషయాన్ని స్వయంగా ఇన్ని రోజులకు తెలియజేశారు రాజమౌళి.

మరో వైపు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే రాజమౌళి వచ్చారు కాబట్టి నటన వైపు వెళ్లే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన నటన వైపు వెళ్లకుండా ఇలా డైరెక్షన్ వైపు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో వెల్లడించడానికి గల కారణమేమిటంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఎన్టీఆర్ రాజమౌళి మధ్య ఒక చిన్న డిస్కషన్ నడిచింది. తాను సీనియర్ అంటే తాను సీనియర్ అని ఇద్దరు వాదించుకున్నారు. అప్పుడే రాజమౌళి నువ్వు సినిమాలోకి రాకముందు తాను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి చెబితే.. వెంటనే ఎన్టీఆర్ నేను బాల నటుడిగా కూడా నటించాను అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి రాజమౌళి స్పందిస్తూ నేను కూడా బాల నటుడిగా పిల్లనగ్రోవి సినిమాలో నటించాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading