ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది వరకు మరణించారు. సిగ్నల్ నిలిపివేయడం వల్లనే మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లైప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ ను ఢీ కొట్టి పట్టాలు తప్పింది. పట్టాలు తప్పినటువంటి కోరమాండల్ రైలు యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం తీవ్రతరమైంది. నిమిషాల వ్యవధిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు.
Advertisement
వాస్తవానికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పశ్చిమబెంగాల్ లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతీ రోజూ ఈ రైలు నడుస్తుంది. దీనికి కోరమాండల్ అనే పేరు పెట్టడానికి ఓ బలమైన కారణమే ఉంది. 1977 మార్చి 06న ఈ రైలు తొలిసారిగా ప్రారంభం అయింది. గరిష్టంగా ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే ముఖ్యమైన రైళ్లతో కోరమాండల్ ఒకటి. 13వ శతాబ్దం వరకు కూడా చోళ సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశమంతటా విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించడంలో కీలక పాత్ర పోషించింది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్ వరకు చోళుల ప్రభావం ఉండేది. చోళులు పాలించిన ప్రాంతాన్ని కోరమండలం అని పిలిచేవారు. భారతదేశంలో ఆగ్నేయ (ఈస్ట్ కోస్ట్) తీరంగా చోళ సామ్రాజ్యం విస్తరించింది.
Advertisement
బంగాళాఖాతం తీరం వెంట భారత్ లోని తూర్పు ప్రాంతాన్ని చోళులు పాలించిన ప్రాంతం కావడంతో కోరమండల్ తీరంగా పేరు వచ్చింది. బ్రిటీష్ వారు పెట్టిన కోరమాండల్ పేరు అలాగే కొనసాగుతుంది. కావేరి నది సంగమ ప్రాంతం నుంచి పులికాట్ సరస్సు వరకు ఉన్న తీర ప్రాంతమే ఈ కోరమండల్. తొలుత ఇది చోళ మండలం తీరంగా పిలిచేవారు. కాలక్రమేణా బ్రిటీష్ వారు కోరమండల్ అని పిలవడం ప్రారంభించారు. ఇది తీర ప్రాంతం వెంట ప్రయాణించే రైలు కావడంతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గా రైల్వే శాఖ పేరు పెట్టింది. ఈ రైలు పశ్చిమబెంగాళ్ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. అందుకే దీనికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ అనే పేరు పెట్టారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?