Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Kota Srinivasa Rao :ఇప్పటి హీరోలకు అలాంటి సంస్కారం లేదు.. ఎందుకో తెలుసా..?

Kota Srinivasa Rao :ఇప్పటి హీరోలకు అలాంటి సంస్కారం లేదు.. ఎందుకో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది సినిమాల్లో నటించి వయోభారంతో ఇంటికి పరిమితమయ్యారు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ఎప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా ఆయన ఒక ప్రోగ్రాం లో మాట్లాడుతూ ప్రస్తుత హీరోలకు కనీసం ఓపిక లేదని అన్నారు.

Advertisement

Ad

ఎలాంటి సంస్కారం లేకుండా ఉంటున్నారని తెలియజేశారు. చాలామంది హీరోలు వారి యొక్క పారితోషకం రూ.2,6 కోట్లు,40,50 కోట్లు తీసుకుంటున్నామని పబ్లిక్ గానే చెబుతున్నారని అన్నారు. కనీసం ఎలాంటి భయం లేకుండా వారు ఉంటున్నారని తెలియజేశారు. అంతేకాకుండా యాడ్స్ విషయంలో కూడా బాత్రూం క్లీన్ చేసే యాసిడ్ నుంచి మొదలు పళ్ళు తోముకునే బ్రష్ వరకు స్టార్ హీరోలే చేస్తున్నారు. దీనివల్ల చిన్న ఆర్టిస్టులకు పని లేకుండా పోతుందని కోట ప్రశ్నించారు.

Advertisement

ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఆర్టిస్టులకు కూడా స్టార్ హీరోలు ఛాన్సులు ఇవ్వాలని కోరారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సూపర్ స్టార్ వంటి స్టార్ హీరోలు కూడా వారి పారితోషకం ఎంత తీసుకుంటూన్నారో చెప్పేవారు కాదని, ఇప్పటికి వారు ఎంత తీసుకున్నారో చాలామందికి తెలియదని అన్నారు. కానీ ఇప్పటి హీరో, హీరోయిన్లుగా ఉంటున్న పారితోషికాన్ని బహిరంగంగా చెబుతూ ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారని చెప్పకనే చెప్పారు కోట శ్రీనివాసరావు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading